Somireddy: దమ్ముంటే కాకాణిని అప్పగించండి.. వైసీపీ నేతలకు సోమిరెడ్డి సవాల్
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:31 PM
Somireddy Chandramohan Reddy:మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని.. కానీ కాకాణి మాత్రం వారిని మించినవారని విమర్శించారు.

నెల్లూరు: మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్ది మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించారని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కరోనా ఆనందయ్య మందు కేసులో ఇవాళ(మంగళవారం) నెల్లూరు రైల్వే కోర్టుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది హాజరయ్యారు. నర్మదా రెడ్ది ఆనందయ్య మందును ఆన్‌లైన్లో అమ్మకాలు పెట్టారని చెప్పారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. కాకణి తన మీద 17 కేసులు పెట్టించారని అన్నారు. తాను నిర్థోషినని చెప్పుకునే కాకణి నెల్లూరు నుంచి ఎందుకు పారిపోయారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
తాను కాకణిపై చేస్తున్న విమర్శలకు తనను, తన తల్లిదండ్రులను సైతం అసభ్యంగా తిట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాకాని తిట్టించిన వైసిపీ మాజీ ఎమ్మెల్యే భాషా, ఎమ్మెల్సీలను ఇలానే తిట్టిస్తాను బరిస్తారా అని ప్రశ్నించారు. పట్టపగలు అనుమతులు లేకుండా క్వాడ్జిని కాకణి దోచుకున్నారని ఆరోపించారు. రౌడీలు, హిజ్రాలను పంపి తనను బద్నామ్ చేయాలని చూశారని అన్నారు. అలాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని అన్నారు. తప్పుచేసిన కాకణి పోలీసులకు దొరకకుండా పారిపోయి తిరుగుతున్నారని ఆరోపించారు. మీడియా ముందు మాట్లాడే వైసీపీ నేతలు.. కాకణి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు.
కాకణి చేసిన పాపాలకు తానే అనుభవిస్తున్నాడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తన మీద కాకణి తప్పుడు కేసులు పెడితే పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు సహకరించానని తెలిపారు. కాకణి లాంటి పనికిమాలిన వ్యక్తులను మంత్రులుగా, జిల్లా అధ్యక్షుడిగా జగన్ చేశారని మండిపడ్డారు. వైఎస్ భారతి గురించి మాట్లాడిన టీడీపీ నాయకులను పార్టీ నుంచి తీసేసిన నేత చంద్రబాబు అని చెప్పారు. వల్లభనేని వంశీ, కాకణి లాంటి నేతలు ఇళ్లల్లో ఆడవాళ్లను తిడితే జగన్ అసెంబ్లీలో నవ్వుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహుల్ చొక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసగాడు, బాంబు బ్లాస్టింగ్ కేసులో ఉన్నా వారిని సైతం పోలీసులు పట్టుకున్నారని.. కానీ కాకణి మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారంటే అంతా చాణిక్యుడు కాకణి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.
కాకాణి, వంశీ వంటి నేతలను జగన్ అదుపు చేయలేదని.. అందుకే వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 61వేల టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తవ్వేశారని 2003లోనే మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేశారని.. అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదన్నారు. నేదురుమల్లి, ఆనం బ్రదర్స్‌తో తాను ధీటుగా పోరాడానని గుర్తుచేశారు. ఎన్నడూ లేని విధంగా కాకాణి తనపై 17 అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. తాను ధీటుగా ఎదుర్కొన్నానని..కాకాణిలా పారిపోలేదని.. పోలీసులకు సహకరించానని తెలిపారు. వైసీపీ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
CM Chandrababu Naidu: మళ్లీ అంబేడ్కర్ విదేశీ విద్య
Vontimitta Accident: అతి వేగం ఖరీదు మూడు ప్రాణాలు
Intermediate Results: ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ టాపర్లకు నేడు సన్మానం
Read Latest AP News And Telugu News