Minister Narayana: వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తాం.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 12 , 2025 | 02:14 PM
Minister Narayana: డ్రైయిన్లు పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

అమరావతి: ఏపీలోని మున్సిపల్ కమిషనర్లతో ఇవాళ(శనివారం) మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజినల్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే కచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అన్నారు.
డ్రైయిన్లు పూడిక తీత వెంటనే ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు. మెరుగైన పారిశుధ్యం కోసం అవసరమైన స్వీపింగ్ మెషీన్లు,ఇతర యంత్రాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఆరోగ్య కారణాలతో క్షేత్ర స్థాయి పర్యటన చేయలేని అధికారులకు డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
59 ఏళ్ల వయసులో చెట్టెక్కిన హీరో
Read Latest AP News And Telugu News