Somireddy: జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి
ABN, First Publish Date - 2023-11-14T15:22:39+05:30
జగన్ ప్రభుత్వ ( Jagan Govt ) వైఫల్యం వల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు.
నెల్లూరు: జగన్ ప్రభుత్వ ( Jagan Govt ) వైఫల్యం వల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జిల్లాలో రైతులు పంటలు పండించలేకున్నారు. 70 ఏళ్ల తర్వాత మొదటి పంటకి నీరందించలేక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. 25 టీఎంసీల నీటిని వృథాగా సముద్రంపాలు చేశారు. సోమశిల మరమ్మతులు చేయలేకపోయారు. కాలువల్లో పూడికతీత పేరిట వైసీపీ నేతలు రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 2002లో 14 టీఎంసీల నీటితో పంటలు పండించే వీలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. ప్రస్తుతం 30 టీఎంసీల నీరున్నా మొదటి పంటకి నీరు ఇవ్వలేదు. జిల్లాకి వ్యవసాయశాఖ, నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నా ప్రయోజనం లేదు. రైతులకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.
Updated Date - 2023-11-14T15:22:59+05:30 IST