Rain: ఏపీలో వర్షం

ABN , First Publish Date - 2023-02-18T21:32:54+05:30 IST

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ప్రభావంతో శనివారం ఉదయం ఉత్తరకోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు

Rain: ఏపీలో వర్షం

విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ప్రభావంతో శనివారం ఉదయం ఉత్తరకోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం (Rain) కురిసింది. అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా శనివారం రాయలసీమ (Rayalaseema), దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగింది. కడప (Kadapa)లో 37.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట చలిగాలులు వీస్తున్నాయి. పగటిపూట ఎండ చుర్రుమనిపిస్తోంది.

Updated Date - 2023-02-18T21:33:02+05:30 IST