Srivari Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
ABN , First Publish Date - 2023-09-18T02:59:15+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీవారి తరపున సర్వసేనాధిపతి అయిన విష్వక్సేనుడు మాడవీఽధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నేడు ధ్వజారోహణం.. రాత్రి నుంచి వాహన సేవలు
పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
తిరుమల, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీవారి తరపున సర్వసేనాధిపతి అయిన విష్వక్సేనుడు మాడవీఽధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం విష్వక్సేనుడు ఆలయానికి చేరుకున్నాక యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ కార్యక్రమం సమాప్తమైంది. ఇక, సోమవారం సాయంత్రం జరిగే ధ్వజరోహణంతో బ్రహ్మోత్సవాల సంరంభం మొదలుకానుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ సోమవారం సాయంత్రం శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి నిర్వహించే పెద్దశేష వాహనంతో వాహనసేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ టీటీడీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే అమల్లో ఉంటాయి.