ప్రయోగ వేదికకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2

ABN , First Publish Date - 2023-02-06T02:24:01+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఎస్‌ఎ్‌సఎల్వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌) ప్రయోగానికి రెడీ అవుతోంది.

ప్రయోగ వేదికకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2

10న నింగిలోకి ఎగరనున్న చిన్న రాకెట్‌

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఎస్‌ఎ్‌సఎల్వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌) ప్రయోగానికి రెడీ అవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి ఈనెల 10న ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి రాకెట్‌ అనుసంధాన ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించారు. షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ జెండా ఊపిన అనంతరం రాకెట్‌ను ప్రత్యేక వాహనంలో ప్రయోగ వేదికకు తరలించారు. ఈ రాకెట్‌ ద్వారా భారత భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-07తో పాటు 2 మైక్రోశాట్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - 2023-02-06T02:24:02+05:30 IST