ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayyanna Patrudu: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ABN, First Publish Date - 2023-01-07T14:05:28+05:30

వైసీపీ ప్రభుత్వం (Ycp Government) విశాఖలో భారీగా భూ దోపిడీ చేస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆరోపించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక

తీవ్ర విమర్శలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వైసీపీ ప్రభుత్వం (Ycp Government) విశాఖలో భారీగా భూ దోపిడీ చేస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆరోపించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘45 వేల కోట్ల ప్రైవేట్ భూములను ఏ2 విజయసాయి రెడ్డి దోచుకున్నారు. ప్రభుత్వ ఆస్తులు, బ్రాందీ షాపులు తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ (Cm jagan). విశాఖ (Visakhapatnam) నుంచి సాఫ్ట్‌వేర్ (Software), హార్డ్ వేర్ కంపెనీలు పోతున్నాయి. ఆఖరికి అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (steel plant Privatization) కావాలని ఒక్కరూ కోరుకోవడం లేదు. విద్యా, వైద్య రంగం మరింత అభివృద్ధి జరగాలి. రివర్స్ టెండరింగ్ అన్నారు.. ప్రాజెక్టులు నత్త నడక నడుస్తున్నాయి. పైగా కాంట్రాక్టుల నుంచి లంచాలు అడుగుతున్నారు. రిజర్వ్ పారెస్టులో మైనింగ్‌ను తవ్వున్నారు.. యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. కొణతాల రామకృష్ణ పోరాట యోధుడు. పుట్టిన ప్రాంతానికి న్యాయం జరగకపోతే మనం ఎందుకు? కాంగ్రెసు పార్టీ హయాంలో ఎన్నో జరిగాయి.. ఎవరూ కాదనలేం. వైఎస్ (YS. Rajasekhara Reddy) హయాంలో సుజల స్రవంతి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram project) కోసం అంజయ్య, వైఎస్, చంద్రబాబు తమ వంతు కృషి చేశారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు కట్టారని... నేను కట్టనని జగన్ అంటే ఎలా? ప్రజలు కూడా ఓటుకు డబ్బులు అడుగుతున్నారు.. డబ్బులు ఇచ్చిన వాడు నిక్కచ్చిగా ఎలా ఉంటారు. పార్టీలు వేరైయినా ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రం అందరూ కట్టుబడి ఉండాలి. పార్టీ కార్యాలయంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం (Andhra University) మారింది. జీవో నెంబర్-1 తేవడాన్ని ఖండిస్తున్నాం. ప్రశ్నిస్తుంటే.. తనపై కూడా కేసులు పెడుతున్నారు.’’ అని వైసీపీ ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

Updated Date - 2023-01-07T14:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising