Bandaru Satyanarayanamurthy: మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బండారు
ABN, First Publish Date - 2023-09-27T22:08:40+05:30
నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy) ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మనీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక సంప్రదాయమైన కుటుంబం గురించి నువ్వు మాట్లాడటమెంటి..? ఒక పనికిమాలిన, దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ రోజాకు సపోర్ట్ చేస్తున్నాడు. మహిళలకు గౌరవమిచ్చే పార్టీ మాది. అందుకే నీ చరిత్ర బయట పెట్టడం లేదు. రోజా 24 గంటల్లోగా నందమూరి, నారా కుటుంబాలకు క్షమాపణ చెప్పకపోతే నీ చరిత్రను బయట పెడుతా’’ అని బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-27T22:08:40+05:30 IST