purandeswari : అల్లూరి జిల్లాలో అక్రమ బాక్సైట్ మైనింగ్ మాఫియా జరుగుతోంది
ABN, First Publish Date - 2023-11-29T17:25:16+05:30
అల్లూరి జిల్లా ( Alluri District ) లో అక్రమ బాక్సైట్ మైనింగ్ మాఫియా ( Bauxite Mining Mafia ) జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి ( Daggubati Purandeswari ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు అల్లూరిజిల్లా పాడేరులో పర్యటించారు. పాడేరులో నిర్మాణంలో ఉన్నా మెడికల్ కాలేజీ, 516E హైవేని పరిశీలించారు. పాడేరు కుమ్మరిపుట్టులో కల్తీమందు తాగి మరణించిన రాజారావు కుటుంబాన్ని పరామర్శించారు. అల్లూరిజిల్లాలో మూడు నియోజక వర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
అల్లూరిజిల్లా ( పాడేరు ) : అల్లూరి జిల్లా ( Alluri District ) లో అక్రమ బాక్సైట్ మైనింగ్ మాఫియా ( Bauxite Mining Mafia ) జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి ( Daggubati Purandeswari ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు అల్లూరిజిల్లా పాడేరులో పర్యటించారు. పాడేరులో నిర్మాణంలో ఉన్నా మెడికల్ కాలేజీ, 516E హైవేని పరిశీలించారు. పాడేరు కుమ్మరిపుట్టులో కల్తీమందు తాగి మరణించిన రాజారావు కుటుంబాన్ని పరామర్శించారు. అల్లూరిజిల్లాలో మూడు నియోజక వర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అన్నివిధాలా వనరులను అందిస్తుందన్నారు. బీజేపీ ఆదివాసుల అభివృద్ధి కోసం మెడికల్ కాలేజీలు హైవేలు, గిరిజన యూనివర్సిటీ , ట్రైబుల్ మ్యూజియం నిర్మిస్తుందని చెప్పారు.
ప్రధానమంత్రి ఆవాసయోజన కింద గిరిజనులకు ఇళ్లను నిర్మిస్తుందని తెలిపారు. చనిపోయిన వారిపేరు మీద భూములు రిజిష్టర్ చేసి వైసీపీ నాయకులు కుంబ రవిబాబు అక్రమమైనింగ్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు , కానీ సంబంధిత మంత్రి ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. బీజేపీ అన్ని నిధులను ఏపీకి అందిస్తుంది కానీ వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నట్లు అబద్ధం చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పాడేరు మెడికల్ కాలేజీకి 370 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని.. కానీ జగన్ ప్రభుత్వం స్థలం మాత్రమే ఇచ్చి అంత తానే చేసినట్లు గొప్పలు చెబుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం కేవలం స్టిక్కర్లకు మాత్రమే పరిమితమైందన్నారు. కేంద్ర పథకాలకు స్టికర్లు వేసుకొని వైసీపీవీగా గొప్పలు చేప్పుకుంటున్నారని దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-29T17:25:22+05:30 IST