ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leader: కోడి కత్తి కోణంలోనే వివేకా హత్య

ABN, First Publish Date - 2023-02-14T13:16:26+05:30

కోడి కత్తి కోణంలోనే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కోడి కత్తి కోణంలోనే మాజీ మంత్రి వివేకా హత్య (Former Minister Viveka Case) జరిగిందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (TDP Leader Palla Srinivasa rao) ఆరోపించారు. మంగళవారం విశాఖలో ‘‘జగనాసుర రక్త చరిత్ర’’ పుస్తకాన్ని పల్లా శ్రీనివాసరావు (Palla Srinivas rao), ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు (MLA Velagapudi Ramakrishna babu), టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (TNSF Sate President Pranav Gopal), టీడీపీ నేతలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... మాజీ మంత్రి వివేకా హత్య వెనుక కుట్ర ఉందని... వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. వివేకా హత్య రోజున.. అవినాష్ రెడ్డి (Avinash Reddy) ఫోన్ నుంచి జగన్‌ (AP CM YS Jaganmohan Reddy) కు కాల్స్ వెళ్లాయని ఆయన తెలిపారు.

వివేకా గొడ్డలి పోటుని.. గుండె పోటు అని విజయ సాయిరెడ్డి (YCP MP Vijayasaireddy) చెప్పారని మండిపడ్డారు. సాక్షి పేపర్ హత్య జరిగిన తరువాత రోజున.. నారాసుర రక్త చరిత్ర అని ఎలా రాశారని ప్రశ్నించారు. సజ్జల (Sajjala Ramakrishna reddy), విజయసాయి రెడ్డిని సీబీఐ (CBI) విచారించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో హత్యను ఉపయోగించి వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చారని.. ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ (YCP)కి సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ (Prashanth Kishore) ను కూడా ఈ హత్య కేసులో విచారణ చేయాలన్నారు. ప్రతిపక్షంలో సీబీఐ విచారణ డిమాండ్ చేసి... అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ (AP CM)డిమాండ్ చేయలేదన్నారు. రూ.40 కోట్లు సుపారీ ఎవరు ఇచ్చారో తెలియాలని పట్టుబట్టారు. వివేకా హత్యపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత సీఎం జగన్ దే అని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-14T13:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising