వరద సాయంలో వలంటీర్‌ కక్కుర్తి

ABN , First Publish Date - 2023-08-04T04:19:51+05:30 IST

ఒకవైపు వరద కారణంగా సర్వం కోల్పోయి వరద బాధితులు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వం అందించే చిరు సాయంలోనూ చేతివాటం ప్రదర్శించాడో వలంటీర్‌. గోదావరికి వరద రావడంతో 15రోజులుగా

వరద సాయంలో వలంటీర్‌ కక్కుర్తి

అల్లూరి కలెక్టర్‌ సీరియస్‌.. మెమో జారీ

కూనవరం, ఆగస్టు 3: ఒకవైపు వరద కారణంగా సర్వం కోల్పోయి వరద బాధితులు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వం అందించే చిరు సాయంలోనూ చేతివాటం ప్రదర్శించాడో వలంటీర్‌. గోదావరికి వరద రావడంతో 15రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకులబోరు, కూనవరం గ్రామ ప్రజలు అడవిలో తలదాచుకున్నారు. వరద తగ్గడంతో ఇళ్లకు చేరుకున్నారు. ప్రభుత్వ సాయం రూ.2వేలును గురువారం పంపిణీ చేయడం ప్రారంభించారు. టేకులబోరులోని 12వ వార్డుకు చెందిన వలంటీర్‌ ముత్యాలరావు వరద సాయం పంపిణీలో చేతివాటం ప్రదర్శించాడు. వరద సాయం రూ.2వేలలో వేయి పక్కదారి పట్టించి రూ.వేయి మాత్రమే అందించాడు. ఇలా పది మంది వరకు తీసుకున్న తర్వాత బాధితులు గొడవకు దిగారు. అనంతరం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్‌ అనసూయ బాధితులకు రావలసిన రూ.1000 తిరిగి ఇప్పించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్థానిక అధికారులపై మండిపడ్డారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృత్తమైతే చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వలంటీర్‌ ముత్యాలరావుకు ఎంపీడీవో మెమో జారీ చేశారు.

Updated Date - 2023-08-04T04:19:51+05:30 IST