TDP News: వచ్చే ఎన్నికల్లో విజయం టీడీపీదే - బొమ్మాజీ అనిల్
ABN , First Publish Date - 2023-03-03T20:38:31+05:30 IST
ప్రజలకు మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో విజయం టీడీపీదేనని చింతలపూడి ఆశావహ అభ్యర్థి బొమ్మాజీ అనిల్ (Bommaji Anil) అన్నారు. కొద్ది రోజులుగా ఆయన చింతలపూడి అసెంబ్లీ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి ముఖ్య నాయకులను కలుస్తున్నారు.

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): ప్రజలకు మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో విజయం టీడీపీదేనని చింతలపూడి ఆశావహ అభ్యర్థి బొమ్మాజీ అనిల్ (Bommaji Anil) అన్నారు. కొద్ది రోజులుగా ఆయన చింతలపూడి అసెంబ్లీ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి ముఖ్య నాయకులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో క్రమశిక్షణ కలిగిన నాయకత్వం, కార్యకర్తలు ఉన్నారని, గ్రామస్థాయిలోపార్టీకి రోజురోజుకు ప్రజాభిమానం, ఆదరణ పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి పరిస్థితులను వివరించామన్నారు.
టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని చంద్రబాబు పేర్కొన్నారని అనిల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తేవడానికి కార్యకర్తలు సమిష్టిగా అంకితభావంతో కృషిచేయాలని పార్టీ అధినేత సూచించారని తెలిపారు. చంద్రబాబు వద్దకు ప్రముఖ సినీ నిర్మాత సి.అశ్వనీదత్‌తో కలిసి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి, ఆశీస్సులు కోరినట్టు అనిల్ తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి