ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harirama Jogaiah: అసలు మీరు ఆయనకే పుట్టారా?.. జగన్‌పై హరిరామ జోగయ్య ఘాటు విమర్శలు

ABN, First Publish Date - 2023-07-04T10:56:03+05:30

సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. మరోసారి సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవన్నారు. ఆయన హుందాతనంలో 10% కూడా జగన్‌లో కనిపించడం లేదని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Former MP Chegondi Harirama Jogaiah) మరో లేఖాస్త్రం సంధించారు. మరోసారి సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవన్నారు. ఆయన హుందాతనంలో 10% కూడా జగన్‌లో కనిపించడం లేదని తెలిపారు. అందుకనే ‘‘అసలు మీరు ఆయనకే పుట్టారా.. అని ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన చూస్తుంటే నాకు అనిపిస్తోంది. సినిమాలలో విలన్ పాత్రకు మీరు సరిపోతారేమో అని కూడా అనిపిస్తోంది’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

చట్ట ప్రకారం విడిపోయి విడాకులు తీసుకున్న వారు మరో వివాహం చేసుకోవడానికి అభ్యంతరమలేదని తెలిపారు. పదే పదే పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పెళ్లిళ్ల గురించి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. కళ్యాణ్‌పై విమర్శించడానికి మరో విషయం లేకనే తమరు ఇలా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) పవన్ దత్తపుత్రుడని విమర్శిస్తున్నారని.. మరి గత ఎన్నికలలో కేసీఆర్ (Telangana CM KCR) నుంచి కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ను (Andhrapradesh State) తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించారు. తాత రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు ప్రజల నుంచి దోచుకోవడం దాచుకోవడమే కదా అని విమర్శలు గుప్పించారు. ఆ అవినీతి చిట్టాను ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా అంటూ హరిరామ జోగయ్య లేఖలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-07-04T12:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising