Chintamaneni: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయి
ABN, First Publish Date - 2023-06-21T17:19:58+05:30
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) విమర్శించారు. దెందులూరులో యాసిడి దాడి మృతురాలు ఫ్రాన్సికా మృతదేహాన్ని సందర్శించి చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడిలో మృతి చెందిన ఫ్రాన్సికా కూతురిని
ఏలూరు: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) విమర్శించారు. దెందులూరులో యాసిడి దాడి మృతురాలు ఫ్రాన్సికా మృతదేహాన్ని సందర్శించి చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడిలో మృతి చెందిన ఫ్రాన్సికా కూతురిని ప్రభుత్వం దత్తత తీసుకుని పూర్తి బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హోంమంత్రి వనిత అయినా.. ఆ శాఖను నిర్వహించేది మాత్రం సజ్జలనేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ఇటువంటి ఘటనలపై సీఎం జగన్ (CM JAGAN) నైతిక బాధ్యత వహించాలన్నారు. భర్త కడసారి చూపు చూడనివ్వకుండా ఖాకీలను పెట్టి ప్రభుత్వం అంత్యక్రియలు చేసిందని చింతమనేని ధ్వజమెత్తారు.
Updated Date - 2023-06-21T17:19:58+05:30 IST