ఎంపీడీవో కార్యాలయంలో వైసీపీ సమావేశం

ABN , First Publish Date - 2023-06-06T02:22:40+05:30 IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఎంపీడీవో కార్యాలయంలో వైసీపీ సమావేశం

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దువ్వాడ వాణి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంపీడీవో ప్రేమలీలను వివరణ కోరగా తాను సోమవారమే బాధ్యతలు చేపట్టానని, పార్టీ సమావేశం విషయం తెలియదని చెప్పారు.

- సంతబొమ్మాళి

Updated Date - 2023-06-06T02:22:40+05:30 IST