YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
ABN , First Publish Date - 2023-05-03T13:46:42+05:30 IST
ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.
అమరావతి : ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. వివేకా హత్య సమయంలో లెటర్‌పై సీబీఐ విచారణ నిర్వహించింది. నేడు సీబీఐ విచారణకు వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్ హాజరయ్యారు. ఇద్దరినీ కలిపి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. తాజాగా ఇతడిని సీబీఐ విచారిస్తోంది. నిన్న పీఏ కృష్ణారెడ్డిని విచారించి సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నేడు మరోసారి కృష్ణారెడ్డి వంట మనిషి కొడుకు ప్రకాష్‌ను విచారిస్తున్నారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ (CBI) మరింత దూకుడు పెంచింది. ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా దర్యాప్తు జరుపుతోంది. మంగళవారం వైఎస్ సునీత (YS Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల (Rajashekhar Reddy) స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. వీరితోపాటు తాజాగా మరికొందరు అనుమానితులకు సీబీఐ నోటీసులు అందజేసింది.
వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నించింది. వివేకా హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఇనయ్ తుల్లా అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే వివేకా మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బయటకు కూడా తీసుకొచ్చింది ఇనయ్ తుల్లానే. ఇనయ్ తుల్లాను గతంలోనే పులివెందులలో సీబీఐ విచారించింది. మరోసారి సీబీఐ కార్యాలయంలో ఇనయతుల్లాను విచారించి.. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అలాగే ఇనయతుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్‌రెడ్డిల స్టేట్మెంట్ను సైతం సీబీఐ రికార్డ్ చేసింది.