Vedanta : వేదాంత వ్యాపారాల విభజన
ABN , First Publish Date - 2023-09-30T04:51:53+05:30 IST
దేశీయ మైనింగ్ దిగ్గజ గ్రూప్ వేదాంత లిమిటెడ్ వ్యాపారాల విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గ్రూప్ వాటాదారుల పెట్టుబడుల విలువను పెంచడంతోపాటు రుణ

ఐదు ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలుగా ఏర్పాటు
వేదాంత వాటాదారులకు ఒక్కో షేరుకు
5 కొత్త కంపెనీల ఒక్కో షేరు కేటాయింపు
న్యూఢిల్లీ: దేశీయ మైనింగ్ దిగ్గజ గ్రూప్ వేదాంత లిమిటెడ్ వ్యాపారాల విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గ్రూప్ వాటాదారుల పెట్టుబడుల విలువను పెంచడంతోపాటు రుణ భారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ సహా తన ఐదు కీలక వ్యాపారాలను విభజించి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. విభజన ప్రక్రియ విభాగాల వారీగా సరళంగా చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా, వేదాంత లిమిటెడ్ వాటాదారు లు కలిగి ఉన్న ప్రతి ఒక్క షేరుకు గాను కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐదు కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.
వ్యాపారాల విభజనకు 12-15 నెలల సమయం పట్టవచ్చని అంచనా. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వేదాంత బోర్డు ‘‘ప్యూర్ ప్లే, అసెట్ ఓనర్ బిజినెస్ మోడల్’’ కు ఆమోదం తెలిపింది. దీంతో కంపెనీకి చెందిన అల్యూమినియం, ఆ యిల్ అండ్ గ్యాస్, పవర్, స్టీల్ అండ్ ఫెర్రస్ మెటీరియల్స్, బేస్ మెటల్స్ వ్యాపారాలు ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు కానున్నాయి. కాగా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) 65 శాతం వాటాతో పాటు కొత్త వ్యాపారాలైన స్టెయిన్‌లె్‌స స్టీల్, సెమీకండక్టర్లు (చి్‌పలు)/డి్‌సప్లే వ్యాపారాల వాటాలను వేదాంత లిమిటెడ్ కొనసాగించనుంది. వేదాంత లిమిటెడ్ షేరు ధర బీఎ్‌సఈలో 6.84 శాతం లాభంతో రూ.222.50 వద్ద క్లోజైంది.
హెచ్‌జెడ్‌ఎల్ పునర్‌వ్యవస్థీకరణ
వేదాంత లిమిటెడ్ అనుబంధ కంపెనీగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) కూడా వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోంది. వాటాదారుల పెట్టుబడి విలువను పెంచేందుకు కంపెనీ కార్పొరేట్ నిర్మాణంపై సమగ్ర సమీక్ష చేపట్టాలని కంపెనీ బోర్డు నిర్ణయించిందని హెచ్‌జెడ్‌ఎల్ తెలిపింది.
జింక్, సీసం, వెండి, రీసైక్లింగ్ వ్యాపారాలను విభజించి ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేయడమే ఈ సమీక్ష ఉద్దేశమని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెచ్‌జెడ్‌ఎల్.. ప్రపంచంలో రెండో అతిపెద్ద జింక్ ఉత్పత్తిదారు. ఐదో అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు కూడా. బీఎ్‌సఈలో కంపెనీ షేరు 3.31 శాతం ఎగబాకి రూ.308.80 వద్ద స్థిరపడింది.
వేదాంత రిసోర్సెస్ రేటింగ్ తగ్గించిన ఎస్ అండ్ పీ
వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ పరపతి రేటింగ్‌ను ‘బీ మైనస్’ నుంచి ‘సీసీసీ’కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకటించింది. రెండ్రోజుల క్రితమే మూడీస్ కూడా కంపెనీ రేటింగ్‌ను తగ్గించింది. వేదాంత కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ (సీఎ్‌ఫఆర్)ను సీఏఏ1 నుంచి సీఏఏ2కు తగ్గించింది. అంతేకాదు, కంపెనీ భవిష్యత్‌పై ప్రతికూల వైఖరిని అలాగే కొనసాగిస్తున్నట్లు మూడీస్ తెలిపింది.