Share News

Rains: నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:45 PM

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. కోవై, నీలగిరి, తేని, తెన్‌కాశి జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో భారీవర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

Rains: నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

చెన్నై: కోవై, నీలగిరి, తేని, తెన్‌కాశి(Kovai, Nilgiri, Teni, and Tenkasi) జిల్లాల్లోని ఒకట్రెండు ప్రాంతాల్లో రాబోయే 48 గంటల్లో భారీవర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం, రానున్న 12 గంటల్లో పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరం వైపుకు పయనించి, తదుపరి 24 గంటల్లో ఉత్తర-ఈశాన్య దిశకు మారి, మధ్య బంగాళాఖాతం మీదుగా పయనించి క్రమంగా బలహీనపడనుంది.

ఈ వార్తను కూడా చదవండి: Minister: ఆ మంత్రి రూటే సపరేటు.. మండే ఎండల్లో ‘రెయిన్‌ కోట్‌’


nani3.2.jpg

ఈ ప్రభావంతో కోవై, నీలగిరి, తేని, తెన్‌కాశి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని, మిగిలిన జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2-3 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశముందని తెలిపింది. చెన్నై(Chennai)లో రానున్న 48 గంటల్లో ఆకాశం కొంత మేఘావృతంగా ఉంటూ, గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Greenfield Expressway: హైదరాబాద్‌-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

CM Revanth Reddy: బ్రిటిష్‌ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు

Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 10 , 2025 | 12:45 PM