Share News

Minister: ఆ మంత్రి రూటే సపరేటు.. మండే ఎండల్లో ‘రెయిన్‌ కోట్‌’

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:22 PM

నా రూటే సపరేటు.. అన్నట్లుగా ఓపక్క ఎండలు మండిపోతుండగా.. ఆ మంత్రి మాత్రం రెయిన్‌ కోట్‌ పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తమిళనాడు మంత్రి కేవీ చెళియన్‌ తన సొంత నిధులతో 130 మంది పాల వ్యాపారులకు రెయిన్‌ కోట్లు అందించారు

Minister: ఆ మంత్రి రూటే సపరేటు.. మండే ఎండల్లో ‘రెయిన్‌ కోట్‌’

- మంత్రి చెళియన్‌ ‘దూరదృష్టి’...

చెన్నై: వర్షాకాలానికి ఇంకా కొన్ని నెలలు ఉన్న తరుణంలో, ప్రస్తుతం మండుతున్న ఎండల్లో పాల వ్యాపారులకు మంత్రి కేవీ చెళియన్‌(Minister Cheliyan) ‘రెయిన్‌ కోట్‌’ అందించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తంజావూరు జిల్లా తిరువిడై మరుదూర్‌ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఉన్నత విద్యాశాఖ మంత్రి కేవీ చెళియన్‌ తన సొంత నిధులతో 130 మంది పాల వ్యాపారులకు రెయిన్‌ కోట్లు అందించారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: నేను బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించలేదు..


nani2.2.jpg

వర్షాకాలం ప్రారంభానికి ఇంకా పలు నెలలు ఉండడంతో, ఇప్పుడే మంత్రి రెయిన్‌ కోట్లు(Raincoats) ఎందుకిచ్చారు? అంటూ ప్రజలు చర్చలు ప్రారంభించారు.‘మంత్రి ఇలాంటి ‘దూరదృష్టి’తో పథకాలు అమలు చేస్తూ, నియోజకవర్గం బాగుపడుంది కదా? అంటూ ప్రజలు ఛలోక్తులు విసురుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Greenfield Expressway: హైదరాబాద్‌-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

CM Revanth Reddy: బ్రిటిష్‌ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు

Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 10 , 2025 | 12:22 PM