Share News

IPL 2025: కొత్త కాంట్రవర్సీలో టీమిండియా స్టార్.. సారీ చెప్పాల్సిందే..

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:59 PM

Indian Premier League: ఓ భారత మాజీ ఆటగాడు లేనిపోని చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ కామెంట్రీ టైమ్‌లో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. మరి.. ఎవరా ప్లేయర్.. అతడేం మాట్లాడాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025: కొత్త కాంట్రవర్సీలో టీమిండియా స్టార్.. సారీ చెప్పాల్సిందే..
Virender Sehwag

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిక్కుల్లో పడ్డాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా పని చేస్తున్న వీరూ.. చలాకీగా మాట్లాడుతూ, ఆట గురించి విశ్లేషణలు చేస్తూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025లో వ్యాఖ్యానం చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అలాంటోడు నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపించే ఓ కమ్యూనిటీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జియాంట్స్ మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీలో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


క్షమాపణ చెప్పాల్సిందే..

ఆ కమ్యూనిటీ ప్రజలు ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా.. ఇలా చాలా చోట్ల ఉన్నారని సెహ్వాగ్ అన్నాడు. అయితే ప్రాంతాన్ని బట్టి వాళ్లు మాట్లాడే భాష మారినా, బుర్ర వాడే తీరులో ఏమాత్రం తేడా లేదంటూ సెటైర్ వేశాడు. దీంతో వీరూపై విమర్శల వాన కురుస్తోంది. ఓ కులం మొత్తాన్ని ఇలా ఎలా అంటారని.. వీరూ మర్యాద ఇవ్వడం నేర్చుకోమంటూ కొందరు నెటిజన్స్ అతడిపై సీరియస్ అవుతున్నారు. ఒక కమ్యూనిటీని ఇలా అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. దీన్ని ఒప్పుకునేదే లేదంటూ వీరూపై కారాలు మిరియాలు నూరుతున్నారు. సెహ్వాగ్ సారీ చెప్పక తప్పదని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సెహ్వాగ్ కూడా అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. అతడు జోక్‌గా కామెంట్స్ చేసినప్పటికీ.. సొంత కులం గురించి ఇలా మాట్లాడటం ఏంటని నెట్టింట విమర్శల జడివాన కురుస్తోంది.


ఇవీ చదవండి:

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

సంజూ శాంసన్‌కు గట్టి షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 01:01 PM