Budget 2023: మధ్యతరగతి జీవులు బడ్జెట్‌లో కోరుకుంటున్నవి ఇవే..
ABN, First Publish Date - 2023-01-22T17:29:55+05:30
కేంద్ర బడ్జెట్ 2023కు (Unin budget2023) గడువు సమీపిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmal Sitaraman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ కూర్పుపై కేంద్ర ప్రభుత్వం (central government) తుది కసరత్తులు చేస్తోంది.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023కు (Unin budget2023) గడువు సమీపిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmal Sitaraman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ కూర్పుపై కేంద్ర ప్రభుత్వం (central government) తుది కసరత్తులు చేస్తోంది. కాగా ఈసారి బడ్జెట్‌పై మధ్యతరగతి జీవులు ( middle class people) గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పన్నుల భారాన్ని (Tax burdens) తగ్గించే చర్యలను బడ్జెట్‌లో ఆశిస్తున్నారు. అందుకే ఈసారి బడ్జెట్ 2023పై చాలా అంచనాలున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ (Narendra modi) సారధ్యంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తుది పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే కావడంతో దీనిపై ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితుల పెంపు కోసం మధ్యతరగతి జీవులు ఎదురుచూస్తున్నారు. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 87ఏ వంటి పరిమితుల మరింత సడలించాలని కోరుకుంటున్నారు.
అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయ పొందేవారి చేతుల్లో మరింత డబ్బు మిగిల్చే చర్యలు బడ్జెట్ 2023లో ఉండొచ్చునని అంచనా వేస్తున్నట్టు ఆర్చిట్ గుప్తా వ్యవస్థాపకుడు, సీఈవో క్లియర్ చెప్పారు. అదనపు ఆదాయంలో వినియోగ అవసరాలను తీర్చుకునే ఉపశమనం ఇవ్వాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. కొవిడ్ మహమ్మారి, ధరల పెరుగుదల, సంక్షోభం, ఉద్యోగుల తొలగింపులు, మెడికల్ వ్యయాలు పెరుగుదల, అంతర్జాతీయంగా మాంద్యం భయపెడుతున్న వేళ ఆశాజనకమైన ప్రకటనలు కోరుకుంటున్నట్టు గుప్తా పేర్కొన్నారు. బడ్జెట్ 2023 సమీపిస్తున్న తరుణంలో మధ్య తరగతి జీవులు ఆశిస్తున్న 5 పన్ను మినహాయింపు చర్యలు ఏవో ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన మినహాయింపు పెంపు
దేశంలో వినియోగానికి మరింత ఊతమిచ్చే పలు అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ప్రధాన పన్ను మినహాయింపు పరిమితిని (basic tax exemption limit) రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచే ఆప్షన్‌ను పరిశీలిస్తోందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తద్వారా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే శ్రమను తప్పించినట్టవుతుందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.
సెక్షన్ 80సీ పరిమితి పెంపు..
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ (section 80C) కింద పెట్టుబడులపై ప్రస్తుతం రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు లభిస్తోంది. గత పదేళ్లలో ఈ పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఈసారి ట్యాక్స్ సేవింగ్, పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా సెక్షన్ 80సీ పరిమితిని పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సెక్షన్ 80డీ పరిమితి సవరణ..
సరసమైన ధరలకే ఇళ్లు, మెరుగైన వైద్యరంగ సదుపాయాలు సహా భారతీయ మధ్యతరగతి వర్గాలు మెరుగైన జీవన ప్రమాణాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక కొవిడ్ తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో మినహాయింపులు కూడా పెరగాలని ఆశిస్తున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వీలుగా సెక్షన్ 80డీ (Section 80D) పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, పరీక్షల వ్యయాలను కూడా ఈ సెక్షన్ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
ఇళ్ల కొనుగోలుదారులకు ఉపశమనం..
మధ్యతరగతి చెల్లింపుదారులకు కొత్త ఇల్లు కొనడం ఇప్పటికీ ఒక కలగానే ఉంది. అందుకే వారిపై భారాన్ని తొలగించేందుకు గృహ రుణాల వడ్డీపై (Home loan interests) మినహాయింపులను (deductions) పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉన్న పరిమితి పెంపుతోపాటు, అదనంగా.. ఏప్రిల్ 1, 2019 - మార్చి 31, 2022 మధ్య ఆమోదం పొందిన గృహ రుణాలపై వడ్డీ మినహాయింపును సెక్షన్ 80ఈఈఏ (Section 80EEA) కింద రూ.1.5 లక్షల మినహాయింపు కోరుకుంటున్నారు. గృహ యాజమాన్యం, లాక్-ఇన్ పిరియడ్ ఈ మినహాయింపులను పెంచాలని కోరుకుంటున్నారు.
ప్రామాణిక మినహాయింపు పెంపు..
ఐదేళ్ల క్రితం అంటే ఆర్థిక సంవత్సరం 2018-19లో ప్రామాణిక మినహాయింపును (Standard deduction) కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం మెడికల్ వ్యయాలు, ఇంధర ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న మినహాయింపును రూ.1 లక్ష వరకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచిచూడాలి.
Updated Date - 2023-01-22T17:33:51+05:30 IST