ట్రయంఫ్ నుంచి రెండు చౌక బైక్‌లు
ABN , First Publish Date - 2023-07-06T02:17:21+05:30 IST
దేశీయ ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ ఆటో, బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన రెండు బైక్‌లు ‘ట్రయంఫ్ స్పీడ్ 400’, ‘ట్రయంఫ్ స్ర్కాంబ్లర్ 400 ఎక్స్’ను...

ప్రారంభ ధర రూ.2.23 లక్షలు
పుణె: దేశీయ ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ ఆటో, బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన రెండు బైక్‌లు ‘ట్రయంఫ్ స్పీడ్ 400’, ‘ట్రయంఫ్ స్ర్కాంబ్లర్ 400 ఎక్స్’ను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.33 లక్షలు. కాగా, ప్రారంభ ఆఫర్ కింద మొదటి 10,000 మంది కస్టమర్లకు రూ.2.23 లక్షలకే విక్రయించనున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ట్రయంఫ్ మోడళ్లలో అత్యంత చౌక బైక్ ఇదే. ఈ నెల ద్వితీయార్ధం నుంచి ఈ బైక్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది అక్టోబరులో మార్కెట్లో అందుబాటులోకి రానున్న స్ర్కాంబ్లర్ 400 ఎక్స్ మోడల్ రేటను ఇంకా ప్రకటించాల్సి ఉంది. గ్లోబల్ మార్కెట్ కోసం తయారు చేసిన ఈ రెండు మోడళ్లను గతవారమే లండన్‌లో ఆవిష్కరించారు. 2017లో కుదుర్చుకున్న అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా బజాజ్ ఆటో, ట్రయంఫ్ ఈ రెండు బైక్‌లను అభివృద్ధి చేశాయి. పుణెకు దగ్గర్లోని చకాన్‌లో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌లో బజాజ్ ఆటో ఈ వాహనాలను ఉత్పత్తి చేయనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగానే ట్రయం్‌ఫకు భారత్‌లో ఉన్న 15 డీలర్‌షి్‌పలను బజాజ్ ఆటో నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 80 నగరాల్లో 100 ట్రయంఫ్ షోరూంలను ఏర్పాటు చేయనున్నట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు.