ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget: ‘హల్వా వేడుక’ ప్రత్యేకత ఏమిటి?.. విశేషాలివే..

ABN, First Publish Date - 2023-01-26T14:05:12+05:30

సంవత్సరానికోసారి వార్తల్లో వినిపించే ఈ ‘హల్వా వేడుక’ (Halwa Ceremony) ఏమిటి?.. బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టే సమయంలోనే ఈ ప్రస్తావన ఎందుకొస్తుంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సంవత్సరానికోసారి వార్తల్లో వినిపించే ఈ ‘హల్వా వేడుక’ (Halwa Ceremony) ఏమిటి?.. బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టే సమయంలోనే ఈ ప్రస్తావన ఎందుకొస్తుంది? బడ్జెట్2023కు (Budget2023) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అవగాహనలేని వారిలో ఉత్పన్నమవుతున్న సందేహాలివీ. మరి సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు (Bandaru Srinivasa Rao) మాటల్లో హల్వా వేడుక విశేషాలపై మీరూ ఓ లుక్కేయండి..

ఢిల్లీ నార్త్ బ్లాక్.. అంటే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ (Finance ministry) కొలువై వుండే కార్యాలయం. బడ్జెట్ తయారీ కార్యక్రమం అంతా అక్కడే జరుగుతుంది. దాదాపు ఓ వారం, పది రోజులపాటు సంబంధిత సిబ్బంది మకాం అంతా అక్కడే. అంటే తిండీ తిప్పలు, పడకా, విశ్రాంతి పూర్తిగా అక్కడే. వీరంతా బడ్జెట్ పూర్తి అయ్యేదాకా ఇళ్లకు పోకుండా రాత్రింబవళ్ళు ఆ కార్యాలయంలోనే వుండిపోతారు. అక్కడ బస చేసే చివరి రోజున ‘హల్వా వేడుక’ (Halwa Ceremony) జరుగుతుంది. సిబ్బంది మొత్తానికి కేంద్ర ఆర్థికమంత్రి స్వయంగా అక్కడే హల్వా సిద్ధం చేసి అందరికీ పంచుతారు. స్వయంగా అంటే మంత్రిగారే హల్వా చేస్తారని కాదు. కడాయిలో తయారైన హల్వాను పెద్ద గరిటతో అలా అలా పైపైన ఒకసారి కలుపుతారని అర్ధం చేసుకోవాలి. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న వేడుక ఇది. కోవిడ్ కారణంగా నిరుడు, అంతకు ముందు ఏడాది హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు. ఇక కేంద్ర బడ్జెట్ 2023-24కు సంబంధించిన హల్వా వేడుక గురువారం (జనవరి 25న) జరిగే అవకాశాలున్నాయి. ఇక బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓతోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్థిక మంత్రి సభకు వస్తారు. నాకు తెలిసి నార్త్ బ్లాకులోనే ఒక ముద్రణాయంత్రం వుండేది. ఇప్పుడు వుందో లేదో తెలియదు. డిజిటల్ శకం మొదలయిన తర్వాత లెదర్ బ్యాగు సైజు, స్వరూపం పూర్తిగా మారిపోయాయి. ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ సమర్పణ. చూడాలి బడ్జెట్ లో హల్వా వడ్డిస్తారా! అంతకు మించింది ఏమైనా జనాలకు అందిస్తారా!.

బండారు శ్రీనివాసరావు

Updated Date - 2023-01-26T14:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising