Home » Halwa ceremony
కేంద్ర బడ్జెట్ 2024ను(budget 2024) మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి ముందు ఇటివల ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను(halwa ceremony) నిర్వహించింది. అయితే అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు. అసలేంటి చరిత్ర అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్ను నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. బడ్జెట్ తయారీ కార్యకలాపాలు ఆగస్టు-సెప్టెంబర్లో ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం బడ్జెట్ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. ప్రెజెంటేషన్ తర్వాత, బడ్జెట్ను ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు.
సంవత్సరానికోసారి వార్తల్లో వినిపించే ఈ ‘హల్వా వేడుక’ (Halwa Ceremony) ఏమిటి?.. బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టే సమయంలోనే ఈ ప్రస్తావన ఎందుకొస్తుంది?