Viral: మగాళ్ల బలహీనతతో ముంబై మోడల్ ఆటలు.. గదికి రప్పించి రూ.35 లక్షలు వసూలు.. అసలు ఏం జరిగిందంటే..?
ABN, First Publish Date - 2023-08-19T11:49:45+05:30
మగాళ్ల బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంది ఓ ఖిలాడీ లేడీ. స్వయంగా మోడల్ అయిన ఆ లేడీ తన అంద చందాలతో, కవ్వింపు మాటలతో ప్రేమ మత్తులోకి దింపింది. కామ వాంఛను తీరుస్తానని గదికి పిలిచి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది.
మగాళ్ల బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంది ఓ ఖిలాడీ లేడీ. స్వయంగా మోడల్ అయిన ఆ లేడీ తన అంద చందాలతో, కవ్వింపు మాటలతో ప్రేమ మత్తులోకి దింపింది. కామ వాంఛను తీరుస్తానని గదికి పిలిచి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 50 మంది మగాళ్లను మోసం చేసింది. వారి నుంచి ఏకంగా రూ.35 లక్షలను కాజేసింది. సదరు మహిళ ఏ బెదురు లేకుండా దర్జాగా సాగిస్తున్న ఈ దందా మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. కాగా ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేహా అలియాస్ మెహర్(Neha alias Meher) అనే ముంబై మోడల్(Mumbai model) కొంతకాలం క్రితం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ యాప్(Telegram) ద్వారా ఓ యువకుడిని పరిచయం చేసుకుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగాక వాట్సాప్‌లో(WhatsApp) ప్రతి రోజూ చాట్ చేసుకునే వారు. దీంతో ఇద్దరి మధ్య బంధం బలపడింది. తన అంద చందాలతో, మాటల కవ్వింపులతో నేహా ఆ యువకుడిని బుట్టలో వేసుకుంది. ఈ క్రమంలో తమ వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. తనకు పెళ్లయిందని, కానీ తన భర్త దుబాయ్‌లో(Dubai) ఉంటున్నాడని నేహా చెప్పింది. ఆ యువకుడితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని(sexual activities) ఉందని చెప్పింది. ఇందుకుగాను ఆ యువకుడిని తన ఇంటికి రమ్మంది. అంతేకాకుండా తన ఫోటోలను, అడ్రస్‌ను కూడా ఆ యువకుడికి షేర్ చేసింది. దీంతో సదరు యువకుడు మార్చి 3న మధ్యహ్నం 3:30 గంటల సమయంలో మెహర్ ఇంటికి వెళ్లాడు. దీంతో ఆ యువకుడిని మెహర్ తన బెడ్ రూంకు తీసుకెళ్లింది.
అయితే ఇంతలోనే ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బెడ్‌రూమ్‌లోకి వచ్చారు. అక్కడ ఎందుకున్నావని యువకుడిని ప్రశ్నించారు. అంతేకాకుండా అతనిపై దాడికి దిగారు. రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బట్టలూడదీసి, నగ్నంగా వీధుల్లో ఊరేగిస్తామని, మసీదుక్ తీసుకెళ్లి సున్తీ చేయిస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు ఫోన్ పే(PhonePe) ద్వారా వారికి రూ.21,500 ట్రాన్స్‌ఫర్ చేశారు. రాత్రి 8 గంటల వరకు యువకుడిని ఆ ముఠా బందీగానే ఉంచింది. క్రెడిట్ కార్డు(credit card) ద్వారా మరో రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ సదరు యువకుడు తన క్రెడిట్ కార్డు ఇంట్లో ఉందని చెప్పాడు. ఇంటికెళ్లి క్రెడిట్ కార్డు తీసుకోస్తానని చెప్పాడు. ఇందుకు ఆ ముఠా అంగీకరించింది. కానీ అతనితో తమలోని ఓ వ్యక్తి కూడా వచ్చాడు. అయితే ఇంటికెళ్లే క్రమంలో సదరు యువకుడు ఏదో ఒక విధంగా అతడి నుంచి తప్పించుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇదొక సెక్స్ రాకెట్(sextortion racket) పని అని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై మోడల్ నేహా అలియాస్ మెహర్ ఇలాంటి ఘటనలకు పాల్పడడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ అనేక మంది మగాళ్లను ఇలాగే మాయ చేసింది. అలా ఇప్పటివరకు 50 మంది మగాళ్లను మోసం చేసిన మెహర్.. వారి నుంచి ఏకంగా రూ.35 లక్షలు వసూలు చేసింది. ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాలో కీలక వ్యక్తి అయినా మెహర్ ఇంకా చిక్కలేదు. కాకపోతే ఆమె ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెహర్‌ను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
Updated Date - 2023-08-19T11:49:45+05:30 IST