Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

ABN , First Publish Date - 2023-06-09T18:24:35+05:30 IST

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు (Apsara Murder Case) పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి. అప్సరను సాయికృష్ణ (Apsara-Sai Krishna) ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? హత్యకు ముందు ఏం జరిగింది..?

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు (Apsara Murder Case) పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి. అప్సరను సాయికృష్ణ (Apsara-Sai Krishna) ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? హత్యకు ముందు ఏం జరిగింది..? హత్య తర్వాత అసలేం జరిగింది..? పోలీసు విచారణలో సాయి ఏం చెప్పాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి అటు గూగుల్‌లో ఓ రేంజ్‌ వెతుకుతుండగా.. ఇటు టీవీలకు జనాలు అతుక్కుపోయారు. అయితే ఈ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఇప్పటికే పెను సంచలన విషయాలు బయటికి రాగా.. తాజాగా పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.

Poojari.jpg

హత్యకు ముందు ఏం జరిగిందంటే..!

హత్యకు ముందు అసలేం జరిగిందనే విషయాలను లోతుగా దర్యాప్తు చేయగా.. పోలీసు విచారణలో అన్నీ పూసగుచ్చినట్లుగా సాయికృష్ణ చెప్పేశాడు. మరోవైపు.. సీఐ శ్రీనివాస్ కూడా మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకోవాలని పదే పదే సాయిపై అప్సర ఒత్తిడి తెస్తుండటంతో ఆమెను హత్య చేయాలని పూజారి పక్కా ప్లాన్ చేసుకున్నాడు. అప్సరను హత్య చేసేందుకే ట్రాప్ చేసి జూన్-3న హైదరాబాద్ బయటికి తీసుకెళ్లాడు. కోయంబత్తూరు వెళ్తున్నట్లు అప్సర ఇంట్లో తల్లికి చెప్పి బయటికి వచ్చింది. సాయికృష్ణ-అప్సర ఇద్దరూ ఫోర్డ్ కారులో సరూర్‌నగర్ నుంచి బయలుదేరివెళ్లారు. తన కారులో దుడ్డకర్ర తెచ్చుకున్నాడు సాయి. శంషాబాద్ చేరుకున్న తర్వాత రాళ్ళగూడ వైపు కార్లు తీసుకువెళ్లాడు సాయి. రాళ్లగూడలో ఇద్దరూ కలిసి సాయి- అప్సర కలిసి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత కారు ముందు సీటులోఅప్సర కూర్చుంది. కారులో కూర్చోని అప్సర విశ్రాంతి తీసుకుంటోంది. ఇదే అదనుగా చేసుకున్న సాయికృష్ణ.. అప్సరను ఇంటి దగ్గర నుంచి బెల్లం దంచే దుడ్డు కర్రతో తలపై బాది హత్య చేశాడుఅని శ్రీనివాస్ మీడియాకు వివరించారు.

Apsara-Photos.jpg

హత్య తర్వాత ఇలా..!

అప్సర చనిపోయిందని తెలుసుకున్న సాయి.. మృతదేహాన్ని అదే కారులో ఇంటికితీసుకొచ్చాడు. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒకరోజు మొత్తం ఇంటి ముందే కారును పార్కింగ్ చేశాడు. మరుసటి రోజున (జూన్-5న) మృతదేహాన్ని తీసుకువెళ్లి మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆ తర్వాత మట్టిన మ్యాన్‌హోల్‌లో నింపాడు. అయితే అక్కడ ఒకరిద్దరు ఏం జరిగిందని ఆరా తీయగా దుర్వాసన వస్తోందని మట్టిని నింపుతున్నట్లు సాయి డ్రామా చేశాడు. ఎవరికి అనుమానం రాకుండానే ఉదయాన్నే వెళ్లి సమయంలో ఈ తతంగం అంతా చేశాడుఅని సీఐ తెలిపారు.

Apsara-Dead-Body.jpg

ఇలా బయటికొచ్చింది..?

కోయంబత్తూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన అప్సర ఎంతసేపటికీ ఫోన్ చేయకపోవడం, ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులను ఆశ్రయించారు. అప్సర తల్లితో పాటు సాయి కూడా.. ఆమెను వెతకడం ప్రారంభించారు. అనంతరం సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ ట్రాక్ రికార్డును పోలీసులు పరిశీలించగా అసలు విషయం వెలుగుచూసింది. సాయి- అప్సర సెల్‌ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం నాడు సాయిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా ఈ విషయం బయటపడింది. జూన్-9న అప్సర మృతదేహం బయటపడింది.

Apsara-Case-Police.jpg

పోలీసులకు ఏం చెప్పాడంటే..

పెళ్లి చేసుకోమని అప్సర నన్ను వేధించింది. అప్సర గర్భం కూడా దాల్చింది. అందుకు నేనే కారణమని ఒత్తిడి చేసింది. కానీ అప్సర వేరేవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేది. ఈ వేధింపుల నేపథ్యంలో నేను హత్య చేశాను. గత కొన్నాళ్ళ నుంచి అప్సరతో నాకు వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి చేసుకోవాలని నన్ను అప్సర చిత్రహింసలు పెట్టింది. వివాహేతర సంబంధం బయటపడుతుందని భయంతోనే నేను అప్సరను హత్య చేశానుఅని పోలీసు విచారణలో సాయి నిజాలు ఒప్పుకున్నాడు.

Apsara-And-Sai-Final.jpg

మరోవైపు.. అప్సర తల్లి, సాయికృష్ణ తండ్రి ఇంకోలా మీడియాకు చెబుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా సాయి తండ్రి విచిత్రంగా మాట్లాడటం గమనార్హం. అప్సరను కంట్రోల్‌లో పెట్టుకోకుండా తల్లి ఏం చేస్తోంది..? అన్నా.. అన్నా పిలిచి పెళ్లి చేసుకోమంటే ఎలా..? అని సాయి తండ్రి మీడియాతో మాట్లాడుతూ కామెంట్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే మధ్యలో సినిమాల ప్రస్తావన కూడా వస్తుండటం గమనార్హం. మరోవైపు.. పూజారి ఇలా చేస్తాడని ఊహించలేదని.. మరొక ఆడపిల్ల బలికాకుండా సాయికృష్ణకు ఉరి శిక్ష వేయాలని అప్సర తల్లి డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

******************************

KCR Vs Congress : సీఎం కేసీఆర్ వింత వైఖరి.. ఆలోచనలో పడిన బీఆర్ఎస్ నేతలు.. సడన్‌గా ఇలా యూటర్న్ తీసుకున్నారేంటో..?

******************************
Ambati Rayudu : ‘అంబటి’ అడుగులు ఎటువైపు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ కేక్‌గా మారిన రాయుడు.. వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేస్తారన్న వార్తల్లో నిజమెంత..?

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఆప్.. కవితలో పెరిగిన టెన్షన్..?

******************************

Telangana Politics : తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..? బీజేపీని కేసీఆర్ పక్కనెట్టారా.. సరెండర్ అయ్యారా.. అసలేం జరుగుతోంది..!

*****************************

Updated Date - 2023-06-09T18:29:42+05:30 IST