ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-03-14T17:22:06+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(Aam Aadmi Party) అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు.

Arvind Kejriwal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(Aam Aadmi Party) అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్(Rajasthan), మధ్యప్రదేశ్( Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. రాజస్థాన్‌లో 200, మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించుతామని ప్రకటించారు. పంజాబ్(Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌(Bhagwant Mann)తో కలిసి కేజ్రీవాల్ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. భోపాల్‌(Bhopal)లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ తమ పార్టీ అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi)కి భయమని కేజ్రీవాల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్(Kamal Nath) ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టిన తీరును కేజ్రీవాల్ తప్పుబట్టారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూరగాయల మార్కెట్‌గా మార్చారని కేజ్రీవాల్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారంటూ ఆయన సీఎం శివరాజ్‌సింగ్(Chief Minister Shivraj Singh Chouhan) పాలనపై విమర్శలు చేశారు.

గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ను తాము గెలిచామని త్వరలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ సత్తాచాటుతామని కేజ్రీవాల్ చెప్పారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) మద్దతుతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ఇటీవల ఎన్నికలు జరిగిన గుజరాత్‌(Gujarat)లో ఆమ్ ఆద్మీ పార్టీ 182 స్థానాలకు పోటీ చేసి కేవలం 5 చోట్ల గెలుపొందింది. 120 చోట్ల ఆప్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అయితే ఆప్‌కు 13 శాతం ఓటింగ్ లభించింది.

ఆప్ ఈసారి కర్ణాటక(Karnataka)లోనూ పోటీ చేయబోతోంది.

Updated Date - 2023-03-14T17:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising