Chandra Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

ABN , First Publish Date - 2023-09-09T09:37:50+05:30 IST

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, అయినా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు.

Chandra Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, అయినా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. ఆయనను సరైన నోటీసు లేకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వివరణ తీసుకోకుండా, విధానాలను అనుసరించకుండా అరెస్ట్ చేయడాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.

ఇదిలావుండగా, చంద్రబాబును విజయవాడకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఆయనను గిద్దలూరు, మార్కాపురం మీదుగా తరలిస్తున్నారు. ఆయన కాన్వాయ్ శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గిద్దలూరు దాటినట్లు తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ యువ నేత లోకేశ్ మాట్లాడుతూ, పిచ్చోడు లండన్‌కి, మంచోడు జైలుకి అని అన్నారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదని అన్నారు. తన తండ్రిని చూసేందుకు వెళతానని ఆయన గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, ఆయనను పోలీసులు తీవ్రంగా నిరోధిస్తున్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్ రాజోలులో రోడ్డుపై బైఠాయించారు.


ఇవి కూడా చదవండి :

Chandrababu Arrest : చంద్రబాబును ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లే యత్నం.. హెలికాఫ్టర్ సిద్ధం..

Chandrababu Arrest : నారా లోకేష్‌ను కదలనివ్వని పోలీసులు.. క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత

Chandrababu Arrest : ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్టో తెలియదు.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం: నారా లోకేష్

Updated Date - 2023-09-09T09:37:53+05:30 IST