Shiv Sena Congress: 1969-71లో కాంగ్రెస్‌కు ఎదురైందే.. ఇప్పుడు శివసేనకు జరిగింది..

ABN , First Publish Date - 2023-02-21T19:44:15+05:30 IST

1969-71 మధ్య కాంగ్రెస్‌ పార్టీకి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది.

Shiv Sena Congress: 1969-71లో కాంగ్రెస్‌కు ఎదురైందే.. ఇప్పుడు శివసేనకు జరిగింది..
Shiv Sena Congress name symbol dispute parellel

ముంబై: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గాన్ని నిజమైన శివసేన(Shiv Sena)గా గుర్తించి 'విల్లు-బాణం' గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) తీసుకున్న నిర్ణయాన్ని ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) వర్గం సుప్రీంకోర్టు (Supreme court)లో సవాలు చేసింది.

1969-71 మధ్య కాంగ్రెస్‌ పార్టీకి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. 1969లో నాటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ కన్నుమూయడంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పతాకస్థాయికి చేరాయి. నాటి ఉపరాష్ట్రపతి వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయమని ఇందిరా గాంధీ ప్రోత్సహించారు. కాంగ్రెస్ పార్టీలోని దిగ్గజాలైన కె.కామరాజ్, నీలం సంజీవరెడ్డి, ఎస్. నిజలింగప్ప, అతుల్య ఘోష్ తదితరులు నీలం సంజీవరెడ్డిని నామినేట్ చేశారు. అయితే వీవీగిరి గెలుపొందారు. ఆ తర్వాత ఇందిరా గాంధీని కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్ పాతతరం నాయకులు కాంగ్రెస్ ఓ గా నిజలింగప్ప సారధ్యంలో ఏర్పాటయ్యారు. వీరికి ఆ సమయంలో మెజార్టీ కూడా ఉంది. కొత్త తరం కాంగ్రెస్‌ న్యూ గా ఇందిరాగాంధీ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ ఓ కు కాడి,ఎద్దుల సింబల్ ఇవ్వగా, ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ వర్గానికి ఆవు, దూడ గుర్తును కేటాయించారు.

ఇందిరా గాంధీ నేతృత్వంలోని వర్గాన్ని ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈసీ గుర్తించింది. 1969లో పార్టీలో ఏర్పడ్డ చీలికలతో నిజలింగప్ప, బాబూ జగ్జీవన్‌రామ్ వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. జగ్జీవన్‌రామ్ వర్గానికి చట్టసభల్లోనూ, పార్టీ సంస్థాగతంగానూ బలం ఉందని ఈసీ నిర్ణయించింది. 1971 జనవరి 11న ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జగ్జీవన్‌రామ్ వర్గానిదే అసలైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని తీర్పు చెప్పింది. కాంగ్రెస్ టికెట్లపై ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన వారిలో అత్యధికులు జగ్జీవన్ రామ్ వర్గంలోనే ఉన్నారని ఈసీ తన ఉత్తర్వుల్లో తెలిపింది. అఖిలభారత కాంగ్రెస్ కమిటీలోనూ అలాగే అవిభాజ్య కాంగ్రెస్‌ ప్రతినిధుల్లో కూడా జగ్జీవన్ రామ్ వర్గానికే ఆధిక్యత ఉందని వెల్లడించింది. కాడి, ఎద్దుల గుర్తును జగ్జీవన్ రామ్ వర్గం నుంచి దూరం చేయడం అనుమతించదగ్గ విషయం కాదని వెల్లడించింది. ఈసీ తీర్పును నిజలింగప్ప వర్గం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మెజార్టీ విషయంలో నిర్వహించిన పరీక్ష, సంఖ్యాబలం గురించి ఈసీ నిర్వహించిన పరీక్ష సరైనదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్నే సాదిఖ్ అలీ తీర్పుగా కూడా ప్రస్తావిస్తుంటారు. దీన్నే ఈ నెల 17న శివసేన కేసులో కూడా ఈసీ ప్రస్తావించింది.

2018లో శివసేన పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలను ఈసీ తప్పుబట్టింది. అవి అప్రజాస్వామికమని వెల్లడించింది. ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి శివసేనలోని రెండు వర్గాలూ ఇవ్వలేదని ఈసీ వెల్లడించింది. శాసనసభాపక్షంలో బలాబలాలను పరిశీలించిన ఈసీ షిండే వర్గానికి ఆధిక్యత ఉందని నిర్ధారించింది.

Updated Date - 2023-02-21T19:44:20+05:30 IST