Jammu and Kashmir: రాజౌరీలో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు...ఎన్‌కౌంటర్
ABN , First Publish Date - 2023-05-05T10:33:42+05:30 IST
జమ్మూకశ్మీరులో శుక్రవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు....
శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో శుక్రవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.(Encounter underway in Rajouri) రాజౌరీ జిల్లాలోని కేసరి ప్రాంతంలోని కంది గ్రామం వద్ద శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గత మూడు రోజుల్లో మూడు ఎన్‌కౌంటర్ లు జరిగాయి. రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)పోలీసులు సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి శుక్రవారం గాలింపు ప్రారంభించారు.భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.
ఇది కూడా చదవండి : Big Relief For Consumers: కేంద్రం ఆదేశంతో తగ్గనున్న వంటనూనెల ధరలు
గురువారం బారాముల్లా జి్లలాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.పోలీసులు మృతుల వద్ద నుంచి ఒక ఏకే 47, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.కుప్వారాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ తో సరిహద్దుల్లో పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది.