EVKS Elangovan: ఉప ఎన్నికల్లో పోటీచేయను...!

ABN , First Publish Date - 2023-01-22T10:28:58+05:30 IST

ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికలో తాను పోటీచేయడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(EVKS Elangovan) నగరంలో

EVKS Elangovan: ఉప ఎన్నికల్లో పోటీచేయను...!

- నా చిన్న కుమారుడికి సీటివ్వండి

- ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌

పెరంబూర్‌(చెన్నై), జనవరి 21: ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికలో తాను పోటీచేయడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(EVKS Elangovan) నగరంలో శనివారం స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌ శాసనసభ్యుడైన ఇలంగోవన్‌ పెద్ద కుమారుడు తిరుమగన్‌ ఈవేరా మృతి చెందటంతో ఉప ఎన్నిక జరుగుతోంది. డీఎంకే అధిష్టానవర్గం ఆ సీటును కాంగ్రె్‌సకే మళ్ళీ కేటాయించింది. టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ ఆ నియోజకవర్గంలో పోటీచేస్తారని గత కొద్ది రోజులుగా వూహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఇలంగోవన్‌ తాను పోటీ చేయడం లేదని ప్రకటించి ఊహాగానాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు. ఫిబ్రవరి 27న ఎన్నిక జరుగుతుందని ఈసీ ప్రకటించగా, ఈ స్థానాన్ని కూటమిలో భాగంగా కాంగ్రె్‌సకే కేటాయిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. అదే సమయంలో ఇళంగోవన్‌ కుటుంబసభ్యులకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రకటించింది. దీంతో ఇళంగోవన్‌ పోటీచేయాలని స్థానిక పార్టీ నేతలు, ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఉప ఎన్నికలో పోటీచేయడం లేదని, తన చిన్న కుమారుడు సంజయ్‌ సంపత్‌కు టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశానన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-01-22T10:29:00+05:30 IST