ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rains : రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..

ABN, First Publish Date - 2023-11-21T22:52:47+05:30

IMD Issues Orange Alert : ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం నాడు ప్రకటనలో తెలిపింది..

ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం నాడు ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా.. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 115.6 నుంచి 204.4 మిల్లీ మీటర్ల వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కాగా.. గత రెండు వారాలుగా, తమిళనాడులోని అనేక ప్రాంతాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేసింది.


వర్షాలే వర్షాలు!

మరోవైపు.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తుండగా.. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేళి, తూత్తుకుడి జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవున్నాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తమిళనాడులో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ముందస్తుగా అధికారులు 400 మందితో రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక కేరళ రాష్ట్రంలో అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్‌ జిల్లాల్లో ఆదివారం నుంచి భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..!

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టం వద్ద ఏర్పడిన ద్రోణి ప్రభావం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం నాడు (నవంబర్-22 న) ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు.. లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. తెలంగాణలో సైతం వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి అది భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఇవాళ రాత్రికి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు రైతులు ఉక్కిరి బిక్కిరి కావడం.. భారీగానే పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-21T22:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising