Milk packets: ఆలయ అభిషేకం పాలప్యాకెట్లు చెత్తకుప్ప పాలు

ABN , First Publish Date - 2023-02-21T11:33:12+05:30 IST

స్థానిక విల్లివాక్కం అగస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా భక్తులు స్వామివారి ప్రత్యేక అభిషేకం కోసం

Milk packets: ఆలయ అభిషేకం పాలప్యాకెట్లు చెత్తకుప్ప పాలు

చెన్నై(ఆంధ్రజ్యోతి): స్థానిక విల్లివాక్కం అగస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా భక్తులు స్వామివారి ప్రత్యేక అభిషేకం కోసం ఇచ్చిన ఆవిన్‌ పాలప్యాకెట్ల(Milk packets)ను ఆలయ నిర్వాహకులు చెత్తకుప్పల్లో పడేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక ప్రసార మాధ్యమాల్లో వెలువడి తీవ్ర కలకలం సృష్టించాయి. భక్తులు అభిషేకం కోసం ఇచ్చిన ప్యాలప్యాకెట్లను పారబోయడానికి బదులు నిరుపేదలకు దానంగా ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై అగస్తీశ్వరాలయ నిర్వాహకులు ఓ ప్రకటన జారీచేస్తూ భక్తులిచ్చిన పాలప్యాకెట్లలో కొన్ని చెడిపోవటంతో మిగతా పాల ప్యాకెట్లను చెత్తకుప్పలో పడేసినట్లు వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-02-21T11:33:14+05:30 IST