PM Modi : టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలి : మోదీ

ABN , First Publish Date - 2023-06-12T14:36:48+05:30 IST

డేటా వినియోగంలో అసమానతలను తొలగించాలంటే టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

PM Modi : టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలి : మోదీ

న్యూఢిల్లీ : డేటా వినియోగంలో అసమానతలను తొలగించాలంటే టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. డిజిటలైజేషన్ వల్ల భారత దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. భాగస్వామ్య దేశాలతో తన అనుభవాలను పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. జీ20 డెవలప్ మినిస్టర్స్ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.

అవసరంలో ఉన్నవారికి ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేవిధంగా మల్టీలేటరల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సంస్కరణలు రావాలన్నారు. అర్థవంతమైన విధాన రూపకల్పనకు, ఆ విధానాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి అత్యున్నత స్థాయి నాణ్యతగల డేటా అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. భారత దేశంలో డిజిటలైజేషన్ వల్ల విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ప్రజలను సాధికారులను చేయడానికి ఉపకరణంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 100కుపైగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్‌లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి తన ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ జిల్లాలు దేశాభివృద్ధికి కీలకంగా మారాయన్నారు.

జీ20 డెవలప్‌మెంట్ మినిస్టర్స్ సమావేశం వారణాసిలో జరుగుతోంది. ప్రజాస్వామ్య మాత నివసించిన అత్యంత ప్రాచీన నగరం వారణాసి అని మోదీ తెలిపారు. అనేక శతాబ్దాలుగా విజ్ఞానం, చర్చలు, సంభాషణలు, వాదోపవాదాలు, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్రం వారణాసి అని చెప్పారు. భారత దేశ వైవిద్ధ్యభరితమైన వారసత్వ సంపదకు సారం ఈ నగరమని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలవారు కలిసే చోటు ఈ నగరం అని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Modi ji thali : మోదీ అమెరికా పర్యటన.. ‘మోదీజీ థాలీ’ని ప్రారంభించిన అమెరికన్ రెస్టారెంట్..

NDA : కొత్త పార్లమెంటులో ‘సెంగోల్’ ప్రతిష్ఠ.. తమిళులకు అమిత్ షా టార్గెట్..

Updated Date - 2023-06-12T14:36:48+05:30 IST