Delhi Development : మోదీ హయాంలో రూ.1.5 లక్షల కోట్లతో ఢిల్లీ అభివృద్ధి : బీజేపీ

ABN , First Publish Date - 2023-05-25T16:28:25+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేళ్లలో ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ వెల్లడించింది. 29 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ,

Delhi Development : మోదీ హయాంలో రూ.1.5 లక్షల కోట్లతో ఢిల్లీ అభివృద్ధి : బీజేపీ
Narendra Modi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేళ్లలో ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ వెల్లడించింది. 29 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ, ప్రారంభించడం కానీ చేసిందని తెలిపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ప్రభుత్వం తమ కోసం ఏం చేసిందో తెలుసుకోవాలని ప్రజలను కోరింది.

బీజేపీ (BJP) ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, ఢిల్లీ శాసన సభలో ప్రతిపక్ష నేత రామ్‌వీర్ సింగ్ బిధూరీ విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వీరేంద్ర మాట్లాడుతూ, గడచిన తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 20 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్, ఆర్ఎంఎల్ వంటి ఆసుపత్రులను విస్తరించినట్లు తెలిపారు. ప్రగతి మైదానం సొరంగాన్ని నిర్మించినట్లు, మూడు చెత్త కుప్పల ఎత్తును తగ్గించినట్లు, మెట్రో నాలుగో దశను విస్తరించినట్లు తెలిపారు.

బిధూరీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్రానికి 400 ఎలక్ట్రిక్ బస్సులను ఇచ్చిందన్నారు. వీటిలో 300 బస్సులను ఇంట్రా-సిటీ కోసం ఢిల్లీ రవాణా సంస్థకు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వంద బస్సులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఇచ్చినట్లు తెలిపారు. ఢిల్లీ రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో బీజేపీ చెప్పిందని, తమ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో బీజేపీకి రాజకీయ, పరిపాలనపరమైన సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం బీజేపీ ఢిల్లీ శాఖ మే 30 నుంచి జూన్ 30 వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ పర్యవేక్షిస్తారు. దీనికోసం సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ కూడా ఇవ్వబోతోంది.

ఇవి కూడా చదవండి :

Parliament Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ దుమారంలో ట్విస్ట్.. సుప్రీం కోర్టుకు పంచాయితీ !

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ప్రారంభించిన ప్రధాని మోదీ

Updated Date - 2023-05-25T16:28:25+05:30 IST