Manmohan Singh-Modi: మన్మోహన్ సింగ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ
ABN, First Publish Date - 2023-09-26T10:48:45+05:30
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. మన్మోహన్ సింగ్ మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఢిల్లీ: భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. మన్మోహన్ సింగ్ మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.’’ అని మోదీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు 91వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న ప్రాంతంలో ఆయన జన్మించారు. 1991-1996 మధ్య కాలంలో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేశారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పిగా పేరు తెచ్చుకున్నారు. 2004-2014 కాలంలో 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. రాజకీయాల్లో ఎలాంటి విమర్శలు లేని, మృదు స్వభావం గల అతి కొద్ది మంది నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కాగా మన్మోహన్ సింగ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Updated Date - 2023-09-26T10:50:22+05:30 IST