Raksha Ramaiah: ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలి..
ABN , First Publish Date - 2023-02-28T12:33:02+05:30 IST
ప్రతిపక్షనేత సిద్దరామయ్యను బహిరంగంగా హెచ్చరించిన ఐటీబీటీ శాఖల మంత్రి అశ్వత్థనారాయణ(Minister Aswatthanarayana)ను
- గవర్నర్‌కు రక్షా రామయ్య వినతి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్యను బహిరంగంగా హెచ్చరించిన ఐటీబీటీ శాఖల మంత్రి అశ్వత్థనారాయణ(Minister Aswatthanarayana)ను కేబినెట్ నుంచి తొలగించాలని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రక్షా రామయ్య(Raksha Ramaiah) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన విధానాలను మంత్రి ధిక్కరించారని ఆరోపించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విధానసౌధలోని బాంక్వెట్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ సాహసాన్ని కొనియాడారన్నారు. కానీ మంత్రి మాత్రం టిప్పు తరహాలోనే సిద్దరామయ్యను పడగొట్టాలని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమన్నారు.