యూఎస్ మిలటరీలో భారత సంతతి వ్యక్తి రవిచౌదరికి కీలక పదవి
ABN , First Publish Date - 2023-03-17T05:51:43+05:30 IST
భారత సంతతికి చె ందిన ఓ వ్యక్తికి అమెరికా మిలటరీలో కీలక పదవి దక్కింది. అమెరికా వాయుసేన సహాయ కార్యదర్శిగా టెస్ట్ .

వాషింగ్టన్, మార్చి 16: భారత సంతతికి చె ందిన ఓ వ్యక్తికి అమెరికా మిలటరీలో కీలక పదవి దక్కింది. అమెరికా వాయుసేన సహాయ కార్యదర్శిగా టెస్ట్ ఇంజనీర్ రవి చౌదరిని నియమితులయ్యారు. ఈ మేరకు అమెరికా సెనెట్‌లో బుధవారం ఓటింగ్ జరిగింది. 69-29 ఓట్ల తేడాతో ఆయన నియమకానికి సెనెట్ ఆమోదముద్ర వేసింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన డజను మందికి పైగా నేతలు ఆయనకు అనుకూలంగా ఓటే శారు. భారతమూలలున్న వ్యక్తికి ఈ పదవి దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. రవి చౌదరి 1993-2015 మధ్య అమెరికా వాయుసేనలో పనిచేశారు.