RTO Offices: ఇక శనివారాల్లోనూ ఆర్టీవో కార్యాలయాలు
ABN , First Publish Date - 2023-07-14T08:22:51+05:30 IST
నగరంలోని ఆర్టీవో కార్యాలయాలన్నీ(RTO Offices) ఇకపై శనివారాల్లోనూ పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్
- నగరంలో ప్రత్యేక అనుమతి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆర్టీవో కార్యాలయాలన్నీ(RTO Offices) ఇకపై శనివారాల్లోనూ పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడం, పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ కమిషనర్ షణ్ముఖసుందరం ఆ శాఖ అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తూ నగరంలోని మీనంబాక్కం, రెడ్‌హిల్స్ సహా ప్రాంతీయ రవాణా కార్యాలయాలు శనివారాల్లో తప్పకుండా పనిచేయాలన్నారు. త్వరితగతిన డ్రైవింగ్ లైసెన్సుల జారీకి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారాల్లో వాహనాల యజమానులు, వాహన చోధకులకు అందించే సేవలపై ఆయా కార్యాలయాల వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రాంతీయ రవాణా కార్యాలయాల అధికారులకు ఏవైనా అనుమానాలుంటే తనను సంప్రదించాలని ఆయన తెలిపారు.