ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Family: విషాదం.. కువైత్ నుంచి సౌదీ వెళ్లిన భారతీయ ఫ్యామిలీ.. రియాద్‌ కారు ప్రమాదంలో దుర్మరణం..!

ABN, First Publish Date - 2023-08-26T11:05:49+05:30

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఇండియన్ ఫ్యామిలీ (Indian Family) కువైత్ నుంచి విజిట్ వీసాపై సౌదీ వెళ్లినట్లు సమాచారం. రియాద్‌ (Riyadh) లో వారు ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మృతులను గౌస్ దంతు (35), అతని భార్య తబరక్ సర్వార్ (31), వారి పిల్లలు ముహ్మద్ దామిల్ గౌస్ (02), ముహ్మద్ ఇహాన్ గౌస్ (04) గా గుర్తించారు. అయితే, మృతులు భారత్‌లోని ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

కువైత్‌లో నివాసం ఉంటున్న దంతు గౌస్ (Ghaus Dantu) తన ఫ్యామిలీతో కలిసి టూరిస్ట్ వీసా (Tourist Visa) పై సౌదీ టూర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో రియాద్‌కు సమీపంలోని తుమామలో హర్ఫ్నా తువైఖ్ రోడ్‌పై ఈ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు ప్రమాదానికి గురైంది. సౌదీ పౌరుడు డ్రైవ్ చేస్తున్న ఓ వాహనం వచ్చి కారును ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న నలుగురు బయటపడలేకపోయారు. కారుతో పాటు నలుగురు సజీవదహనమయ్యారని రియాద్ ట్రాఫిక్ పోలీసులు (Riyadh Traffic Police) వెల్లడించారు. చనిపోయింది భారతీయ కుటుంబం కావడంతో వెంటనే పోలీసులు సౌదీలోని మలయాళీ సామాజిక కార్యకర్త సిద్దిఖీ తువ్వూర్‌కు సమాచారం అందించారు.

పోలీసుల సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చిన ఆయన మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేకపోయినట్లు తెలిపారు. ఒకవేళ దంతు గౌస్ కుటుంబ గురించి తెలిసినవారు కువైత్‌లో ఉంటే.. వెంటనే రియాద్‌లోని భారత ఎంబసీ (Indian Embassy) లేదా సిద్దిఖీకి (+966508517210, 0503035549) కాంటాక్ట్ చేయాలని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నలుగురి మృతదేహాలను రియాద్‌లోని రుమ్హా ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు వెల్లడించారు.

Expats: ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు కువైత్‌లోని ప్రవాసులకు మరో కొత్త షరతు..!


Updated Date - 2023-08-26T11:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising