ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: 'దిల్ సే' ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

ABN, First Publish Date - 2023-09-24T13:17:13+05:30

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్‌లో 'దిల్ సే' స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సారిగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

హాజరైన వేలాది భక్తులు

మెల్బోర్న్, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్‌లో 'దిల్ సే' స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సారిగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మేల తాళాలతో వినాయకుణ్ణి భక్తుల సమక్షంలో ఊరేగించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, పాటల కార్యక్రమాలతో సందడిగా నిర్వహించారు. అశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతిని ఎన్నారైలు మరవకుండా ఇటువంటి గొప్ప సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించిన 'దిల్ సే' సంస్థ అధ్యక్షుడు హర్ష రెడ్డి, నిర్వాహకులు సాయి కిరణ్, నిఖిల్, దరణేశ్, శ్రవణ్, బంటీ, శ్రీకర్, నవీన్, ఉమా పతి, సాగర్, శరత్, మోహన్, ప్రజ్జున్, శ్రీకాంత్, దత్తా, భవేశ్‌లను ప్రవాస సంఘాలు, ప్రజలు అభినందించారు. ఇక గణేష్ లడ్డు కోసం వేలం నిర్వహించగా 'జ్యూస్ క్రీం అండ్ కో' ఫుట్ స్క్రే సంస్థ 15 వేల 116 డాలర్ల భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం.

Updated Date - 2023-09-24T13:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising