Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
ABN, First Publish Date - 2023-11-15T07:40:44+05:30
Indian Students in US: ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా (America) కు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల (Indian Students) సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్ (India) నుంచి ఉన్నత విద్య కోసం విద్యార్థులు యూఎస్ వెళ్లారు.
Indian Students in US: ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా (America) కు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల (Indian Students) సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్ (India) నుంచి ఉన్నత విద్య కోసం విద్యార్థులు యూఎస్ వెళ్లారు. తాజాగా వెలువడిన ఓపెన్ డోర్స్ నివేదిక (Open doors Report) ప్రకారం 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. గడిచిన 40 ఏళ్లలో ఇదే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2.9లక్షల మంది (27శాతం) స్టూడెంట్స్‌తో డ్రాగన్ కంట్రీ చైనా తొలిస్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇండియా నుంచి 2,69,000 మంది (25శాతం) విద్యార్థులు ఉన్నారు. భారత్ నుంచి వచ్చిన వారిలో 35శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది.
UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!
సైన్స్, టెక్నాలజీ, బిజినెస్, ఇంజినీరింగ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నట్లు ఓపెన్ డోర్స్ నివేదిక తెలియజేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన వారి సంఖ్య దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని తాజా గణాంకాలు తెలిపాయి. కాగా, తాజా లెక్కల ప్రకారం కరోనాకు (Corona) ముందు అగ్రరాజ్యానికి వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల సంఖ్యకు చేరుకుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారి డ్రాగన్ కంట్రీని ఇండియా అధిగమించింది.
Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!
భారత్ నుంచి యేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో చైనా (China) నుంచి గత మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇక చైనా, భారత్ తర్వాత సౌత్ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియాకు చెందిన విద్యార్థులు యూఎస్‌లో అధికంగా ఉన్నారు. కాగా, యూఎస్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (US Graduate Program) లో విద్యార్థుల ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, బిజినెస్ విభాగాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాంలో 21శాతం పెరుగుదల నమోదు కాగా.. మ్యాథమేటిక్స్, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్, బిజినెస్ విభాగాలు ఉన్నాయని తాజాగా వెలువడిన ఓపెన్ డోర్స్ నివేదిక తెలిపింది.
Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..
Updated Date - 2023-11-15T07:40:45+05:30 IST