ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ambedkar statue in US: అగ్రరాజ్యం అమెరికాలో అంబేద్కర్ భారీ విగ్రహం

ABN, First Publish Date - 2023-10-04T13:49:19+05:30

అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీర్ అంబేద్కర్‌ (BR Ambedkar) కు అరుదైన గౌరవం దక్కనుంది. యూఎస్‌లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

మేరీల్యాండ్‌: అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీర్ అంబేద్కర్‌ (BR Ambedkar) కు అరుదైన గౌరవం దక్కనుంది. యూఎస్‌లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా రూపొందించిన 19 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఇండియా అవతల ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం కూడా ఇదే. మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరం (Accokeek city) లో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ (Ambedkar International Center) లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది.

అలాగే దీనికి ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ (Statue of Equality) గా నామకరణం చేశారు. ఈ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి అయిన అక్టోబర్ 14వ తారీఖున ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ స్మారక చిహ్నం బాబాసాహెబ్ సందేశాలు, బోధనలను వ్యాప్తి చేయడానికి, అలాగే సమానత్వం, మానవ హక్కులకు చిహ్నంగా ప్రదర్శించబడుతుందని ఏఐసీ (AIC) పేర్కొంది. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపింది. గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని డిజైన్‌ చేసిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు.

US: 9నెలల క్రితమే అమెరికా వెళ్లిన హైదరాబాదీ.. అంతలోనే ఊహించని విషాదం..!


Updated Date - 2023-10-04T13:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising