ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయ్యడం దారుణం: రావి రాధాకృష్ణ

ABN, First Publish Date - 2023-09-09T10:11:47+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని అన్నారు.

చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ

ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయ్యడం చాలా దారుణమన్నారు. తెలుగు ప్రజల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన చంద్రబాబుపై ఆధారాలు లేని కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి జరిగిన అవమానంగా అభివర్ణించారు.

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఆ అసహనంతో ఈ విధంగా అరెస్ట్ చేయ్యడం పిరికిపంద చర్య అని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా అక్రమ అరెస్టును చేదించుకొని వస్తారని రాధాకృష్ణ జోస్యం చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Chandrababu Arrest: మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ గృహ నిర్బంధం


Updated Date - 2023-09-09T10:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising