NRI TDP USA: ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఘనత.. ఎన్టీఆర్‌దే..

ABN , First Publish Date - 2023-01-20T20:42:05+05:30 IST

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని జీడబ్ల్యూటీసీఎస్ పూర్వ అధ్యక్షురాలు, తెలుగు మహిళ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో..

NRI TDP USA: ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఘనత.. ఎన్టీఆర్‌దే..

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే (NTR) దక్కుతుందని జీడబ్ల్యూటీసీఎస్ (GWTCS) పూర్వ అధ్యక్షురాలు, తెలుగు మహిళ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో (America Washington DC) తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి సాయిసుధ పాలడుగు అధ్యక్షత వహించారు.

nri-tdp-news.jpg

ఈ సందర్భంగా సాయిసుధ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను పోగొట్టి.. పురుషులతో పాటూ అన్నిరంగాల్లో సమానంగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని చెప్పారు. నా తెలుగింటి ఆడపడుచులంటూ ఎంతో వాత్సల్యాన్ని చూపేవారని గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి.. మహిళలకు రాజ్యాధికార కట్టబెట్టారని తెలిపారు. అలాగే తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. ఎన్టీఆర్.. తెలుగుజాతికి ఆత్మగౌరవాన్ని ఇస్తే, చంద్రబాబు (Nara Chandrababu Naidu).. ఆత్మవిశ్వాసం ఇచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ భావావేశాన్ని, భావజాలాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. యూఎస్‌లో నిర్వహించే టీడీపీ (TDP) కార్యక్రమాల్లో.. మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పనిఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కోసం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే.. ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని సాయిసుధ పేర్కొన్నారు.

tdp-usa.jpg

రిటైర్డ్ ప్రిన్సిపల్ షకీరా బేగం మాట్లాడుతూ.. మహిళలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎన్టీఆర్.. పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచారన్నారు. అక్షరసేద్యంతో తెలుగుభాషను సుసంపన్నం చేశారని కొనియాడారు. మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచిచూపించారని చెప్పారు. అదేవిధంగా అక్షరాన్ని ఆయుధంగా మలచి సాహితీజగత్తును శాసించారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో అనిత మన్నవ, శ్రీలత నార్ల, పద్మజ బేవర, తనూజ యలమంచలి, శిరీష నర్రా, అపర్ణ వీరమాచినేని, కరిష్మ కొంగర, శాంతి పరిముపల్లి, ప్రణీత కంతు, శ్వేత కావూరి, వల్లి కుర్రే, పద్మ కోడె, మల్లి నన్నపనేని, రాధి కొట్నూరు, సుష్మ అమృతలూరి, దుర్గ చలసాని, కార్జల్ అచలసాని, స్వప్న, స్వర్ణ కమల్, రోహిత తన్నీరు, రమాదేవి మన్నవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-20T20:45:23+05:30 IST