Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం, ఇల్లు, ఊరు, స్కూలు చిత్రాలు..
ABN, First Publish Date - 2023-12-07T13:02:53+05:30 IST
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇల్లు, ఊరు, స్కూలు చిత్రాలు గమనించగలరు...

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్బంగా తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వగ్రామం.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఫోటో చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన కొండారెడ్డిపల్లి గ్రామవాసి

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్బంగా స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రేవంత్‌రెడ్డి సోదరుని సహకారంతో కాంగ్రెస్ శ్రేణులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న దృశ్యం. ఇన్‌షర్టులో సీఎం నివాసం వద్ద సందడి..

చిన్నతనంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల ఇదే...

రేవంత్‌రెడ్డి సీఎం అయిన సందర్భంగా ఆయన సోదరుడు జగాల్‌రెడ్డి కొండారెడ్డిపల్లిలోని హన్‌మాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం వంగూరు మండలం, కొండారెడ్డిపల్లిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం
Updated at - 2023-12-07T13:02:56+05:30