ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy : ‘బండి’ని తప్పించి మరీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక ఇంత కథుందా.. అది కూడా రెండోసారి..!?

ABN, First Publish Date - 2023-07-04T19:48:44+05:30

బీజేపీని ఈ స్థాయికి తెచ్చిన బండి సంజయ్‌ను పక్కనెట్టి మరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) అగ్రనాయకత్వం ఎందుకు ఈ పదవి కట్టబెట్టింది..? అది కూడా రెండోసారి ఎందుకిచ్చింది..? ఇంత మంది సీనియర్లు, ముఖ్యనేతలు వద్దనుకుని కిషన్‌రెడ్డే ఆ పదవి ఎందుకు..? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? అనే ప్రశ్నలు బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. తెలంగాణలో ఎక్కడో ఉన్న బీజేపీని (Telangana BJP) బీఆర్ఎస్‌తో (BRS) ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకురావడంలో బండి సంజయ్ (Bandi Sanjay) పాత్ర కీలకమైనది.. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Elections) తర్వాత కాస్త డీలా పడటం, వర్గ విబేధాలు తప్పితే మిగిలినదంతా సాఫీగానే ఉంది. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడ్ని మారుస్తారనే వార్తలు వచ్చాయో.. నాటి నుంచి రహస్య సమావేశాలు, నేతల్లో అసంతృప్తి, వర్గవిబేధాలు ఇవన్నీ తెరపైకి వచ్చాయి. అయితే బీజేపీని ఈ స్థాయికి తెచ్చిన బండి సంజయ్‌ను పక్కనెట్టి మరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) అగ్రనాయకత్వం ఎందుకు ఈ పదవి కట్టబెట్టింది..? అది కూడా రెండోసారి ఎందుకిచ్చింది..? ఇంత మంది సీనియర్లు, ముఖ్యనేతలు వద్దనుకుని కిషన్‌రెడ్డే ఆ పదవి ఎందుకు..? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? అనే ప్రశ్నలు బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి. కిషన్ రెడ్డికి ఉన్న క్వాలిటీస్ ఏంటి..? ఎందుకింతలా బీజేపీ నాయకత్వం కిషన్‌ను నమ్మింది..? ఇప్పుడున్న కేంద్ర మంత్రి పదవి కొనసాగింపా..? లేకుంటే తీసేస్తారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ఎవరీ కిషన్ రెడ్డి..!?

1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1977లో జనతా పార్టీలో యువనాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి 1982-83 వరకు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. ఆ తర్వాత ఏడాదిపాటు రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2002-2005 వరకు బీజేపీ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో హిమాయత్ నగర్‌ నుంచి.. 2009లో హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గమైన అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటి వరకూ పార్టీలో అన్ని పదవులతో సీనియార్టీ పొందినేతగా మంచి గుర్తింపు రావడంతో ఏకంగా ఉమ్మడి ఏపీ అధ్యక్షపదవిగానే నియమించింది హైకమాండ్. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా ఆ తర్వాత 2014-16 వరకు తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో అంత టఫ్ ఫైట్‌లోనూ అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 నుంచి 2018 వరకూ తెలంగాణ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. అయితే.. కిషన్ రెడ్డిని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని భావించిన అధిష్టానం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత 2021 నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అయితే ఇంత అపార అనుభవం ఉన్న కిషన్ రెడ్డి అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని సక్రమంగా నడపలగరని మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధినాయకత్వం నియమించిందని తెలుస్తోంది.

ఓహో ఇలా లెక్కేసిందా..?

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడటంతో ఒక్కసారిగా అగ్రనాయకత్వం రూటు మార్చిందని చెప్పుకోవచ్చు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి.. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాల్సిందేనని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చేసింది. ఏపీ అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Puranadeswari) , తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అయితే ఇప్పటికే ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా 2010 నుంచి 2014 వరకు పనిచేసిన కిషన్ రెడ్డికే ఈ పదవి రెండోసారి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.. ఇక పార్టీలో నేతలు లేరా అనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. అయితే.. రాజకీయ విశ్లేషకులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చూస్తే చాలా లెక్కలు బేరీజు చేసుకునే అధిష్టానం కిషన్ రెడ్డిని నియమించిందని తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీకి కిషన్ రెడ్డి నమ్మినబంటు.. ఎందుకంటే సాధారణ కార్యకర్తగా బీజేపీలో జీవితాన్ని ప్రారంభించి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ఈయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు.. అందర్నీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉండే నేత.

- ప్రస్తుతం తెలంగాణలో వర్గ విబేధాలు, నేతల్లో అసంతృప్తి ఎక్కువైంది. ఈటల రాజేందర్ (Etela Rajender) వర్గం ఓ వైపు.. ఇంకోవైపు బండి వర్గంగా బీజేపీ చీలిపోయింది. రహస్యంగా సమావేశాలు కూడా నిర్వహించడంతో ఒక్కసారి పరిస్థితులు మారిపోయాయి. అయితే ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అసలుకే ఎసరొస్తుందని భావించిన ప్రధాని మోదీ, అమిత్ షాలు.. ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెడితే అన్నీ సెట్ అవుతాయి..? ఎవరైతే అందర్నీ కలుపుకుని ముందుకెళ్తారు..? గేమ్ ఛేంజర్‌గా ఎవరున్నారు..? అని లోతుగా పరిశీలించిన అధిష్టానం కిషన్ రెడ్డి వైపు మొగ్గుచూపిందని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

- పైగా ఆర్ఎస్ఎస్ (RSS) బ్యాగ్రౌండ్, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కావడం, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం ఇవన్నీ కిషన్ రెడ్డికి ప్లస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- ఇవన్నీ ఒక ఎత్తయితే.. కిషన్ రెడ్డి చాలా నెమ్మదస్తుడు.. ఎవరితోనూ విబేధాల్లేవ్.. సొంత పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలతోనూ మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంటారు. అందుకే ఇలాంటి వ్యక్తికి బీజేపీలో ఉన్న అసంతృప్తులను శాంతిపచేయడం, వర్గ విబేధాలు లేకుండా చేయడం పెద్ద విషయం కాదని మోదీ, అమిత్ షా భావించారట.

- మరీ ముఖ్యంగా.. ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి పార్టీలో లోటుపాట్లు, సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడంలో అనుభవం పనికొస్తుందని కూడా పెద్దలు భావించి ఉండొచ్చు.

ఇవి కూడా కారణాలు కావొచ్చేమో..?

కిషన్ రెడ్డికి బీజేపీలోనే కాదు ఇతర పార్టీలోని నేతలతోనూ మంచి సత్సంబంధాలు ఉండటంతో రేపొద్దున బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలన్నా ఆ పరిచయాలు పనికొస్తాయని హైకమాండ్ భావించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌ అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. పైగా ఎప్పుడూ బీజేపీ అన్నా.. మోదీ అన్నా ఒంటికాలిపై లేచే సీఎం కేసీఆర్ ఈ మధ్య అస్సలు కాషాయ పార్టీని పట్టించుకున్న దాఖలాల్లేవ్. పైగా చిన్నపాటి విమర్శ చేసిన సందర్భం కూడా లేదు. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్‌నే ఫాలో అవుతున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బాగా బలపడుతోంది.. ఆ పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అయితే కాంగ్రెస్‌ను ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదని బీజేపీ, బీఆర్ఎస్ భావిస్తున్నాయని ఆ మధ్య జాతీయస్థాయి నేత ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారని వార్తలొచ్చాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్‌తో మంచి సంబంధాలుండే కిషన్ రెడ్డి నియమించి ఉంటారని కూడా టాక్ నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమిలోకి బీఆర్ఎస్ చేరే ఛాన్స్ ఉందని అందుకే.. కేసీఆర్‌‌తో సత్సంబంధాలున్న కిషన్ రెడ్డి అయితే అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటారని బీజేపీ అగ్రనాయకత్వం భావించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. బీజేపీ-బీఆర్ఎస్ కలిసి అడుగులు ముందుకేస్తాయనే సంకేతాలు ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటనతో కాస్త లీకులు వచ్చాయి. ఆయన ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు.. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు, ఆర్ఎస్ఎస్ బండి మార్పుపై ససేమీరా అన్నప్పటికీ మోదీ, షా ఈ నిర్ణయం తీసేసుకున్నారట. అంతేకాదు.. ఇవన్నీ ఒకఎత్తయితే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానా కారణాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి చూస్తే.. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఉన్న పరిస్థితులను గట్టెక్కించడానికి కిషన్ రెడ్డి అయితేనే కరెక్ట్ అని.. గేమ్ ఛేంజర్‌ అని బీజేపీ నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. బండి తర్వాత కిషన్ ఏ మాత్రం పార్టీని బలోపేతం చేస్తారు..? పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలేంటి..? అనేవి తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


Telugu States BJP : ఏపీలో కిరణ్ రెడ్డికి.. తెలంగాణలో ఈటలకు కీలక పదవులు.. ఈ ఇద్దరికే ఎందుకంటే..!?


బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డి.. బండి సంజయ్ రాజీనామా.. వాట్ నెక్స్ట్..


TS BJP : తెలంగాణ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి వద్దన్నారా.. అగ్రనేతల ఆలోచనేంటి.. ‘బండి’ ముందు రెండు ఆప్షన్లు.. రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..!?


Updated Date - 2023-07-04T20:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising