ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS BJP : చేవెళ్ల సభలో అమిత్ షా తీవ్ర అసహనం.. టూర్ ముగించుకొని వెళ్తూ.. వెళ్తూ.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..!

ABN, First Publish Date - 2023-04-25T21:11:43+05:30

ఎన్నో ఆశలతో తెలంగాణ పర్యటనకు (TS Tour) వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా (Central Minister Amit Shah) అసంతృప్తికి గురయ్యారా..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నో ఆశలతో తెలంగాణ పర్యటనకు (TS Tour) వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా (Central Minister Amit Shah) అసంతృప్తికి గురయ్యారా..? రాష్ట్ర కమలనాథుల తీరుతో తీవ్ర అసహనానికి లోనయ్యారా..? ఆశించినంతగా షా టూర్ జరగలేదా..? అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి చందంగా చేవేళ్ల టూర్ జరిగిందా..? పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తూ.. వెళ్తూ ఆ ఇద్దరు అగ్రనేతలకు క్లాస్ తీసుకున్నారా..? ఈ విషయాలన్నీ ఆలస్యంగా వెలుగు చూశాయా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. ఇంతకీ అమిత్ షా అసలు ఏం ఆశించి చేవెళ్లకు వచ్చారు..? షా పర్యటనలో అసలేం జరిగిందనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.

అసలేం జరిగింది..?

‘హార్డ్ టాస్క్ మాస్టర్’ (Hard Task Master) గా పేరొందిన షా తెలంగాణ పర్యటనకు ఎప్పుడొచ్చినా కమలనాథుల్లో టెన్షన్ మొదలవుతుందట. ఇదివరకు పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన టాస్క్ ఇంకా పూర్తి కాలేదు.. ఈసారి ఏం ఏమేం అసైన్‌మెంట్లు అప్పగిస్తారో అని నేతల్లో ఆందోళనతో భయపడిపోతారట. ఈ టాస్కుల్లో భాగంగా గతంలో షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు.. ఆరేడు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ సన్నద్ధత, సంస్థాగత బలోపేతం, ఇతర పార్టీల నుంచి చేరికల వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలను గతంలో రాష్ట్ర ముఖ్య నేతలు బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్‌కు (Etela Rajender) షా సూచించారట. ముఖ్యంగా చేరికల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా ఊరుకునే ప్రసక్తే లేదని ఒకటికి రెండుసార్లు చెప్పారట. అంతేకాదు ఈ చేరికలకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం.. దీనికి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చైర్మన్‌గా నియమించడం జరిగింది. వాస్తవానికి.. అప్పట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy).. ఈ మధ్య ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheswar Reddy) తప్పితే కాంగ్రెస్ (Congress) నుంచి గానీ.. బీఆర్ఎస్ (BRS) నుంచి గానీ ఒక్కరంటే ఒక్క ముఖ్య నేత కాషాయ కండువా కప్పుకున్న పరిస్థితులు అయితే లేవు. షా చేవెళ్ల పర్యటనలో (Shah Chevella Tour) భారీగానే చేరికలు ఉండాలని ఆదేశాలు రావడంతో ఇక్కడ నేతలు విశ్వప్రయత్నాలు చేశారట. కానీ ఆచరణలో మాత్రం అవేమీ జరగలేదట.

ఇలా కూల్ చేశారట..!

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) లాంటి బడా నేతలు మొదలుకుని చోటా మోటా నాయకులను బండి, ఈటల సంప్రదించినా ఒక్కరంటే ఒక్కరూ వర్కవుట్ కాలేదట. దీంతో చేవేళ్ల సభలో అమిత్‌ షాకు ముఖం చూపించడానికి కూడా ఫీలయ్యారట. సభలో ఓ రేంజ్‌లో చేరికలు ఉంటాయని ఆశించిన షా.. కూడా ఈటల, బండిపై తీవ్ర అసహనానికి లోనయ్యారట. ఇదేం పద్ధతి..? నేనేం చెప్పాను.. మీరేం చేస్తున్నారు..? ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రభావమున్న నాయకుల చేరికలు జరగలేదేం..? బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి చాలా మంది టచ్‌లో ఉన్నారని రాష్ట్ర నాయకులు తరచూ చెప్పడమే తప్ప.. ఆ మేరకు కార్యాచరణ ఎందుకు ముందుకు పడలేదు..? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందన్నట్లుగా షా కోపగించుకున్నారట. తదుపరి పర్యటనకు మాత్రం కచ్చితంగా చేరికలు ఉంటాయని భారీగానే ప్లాన్ చేస్తున్నామని.. చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల చేరికలు జరగలేదని షాకు నచ్చజెప్పారట. దీంతో కేంద్రమంత్రి కాస్త కూల్ అయ్యారట.

ఈ ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారా..?

తెలంగాణ టూర్ ముగించుకుని వెళ్తూ.. వెళ్తూ స్పెషల్‌గా ఈటల, బండి సంజయ్‌ను దగ్గరికి పిలిచిన అమిత్ షా ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారట. బండి సంజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీలో వర్గపోరు ఎందుకు..? బలోపేతం చేసుకోకుండా పంథాలు, పట్టింపులకు పోవడం ఏ మాత్రం సబబు కాదు..? పద్ధతి మార్చుకోవాల్సిందేనని ఈటలకు గట్టిగానే తలంటారట. రాష్ట్రంలో ఏ విషయంపై మాట్లాడినా, ఎవర్ని విమర్శించాలన్నా అందరూ ఒకే మాట మీద ఉండి చేయాలని ఎవరికి తోచినట్లు వారు మీడియా ముందుకెళ్లి మాట్లాడొద్దని బండికి కూడా క్లాస్ తీసుకున్నారట. ఇకపై ఇలాంటివి పునారావృత్తం కాకుండా చూసుకోవాలని కూడా గట్టిగానే ఇద్దరికీ అమిత్ షా చెప్పారట. కాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారు దేవాలయంలో ప్రమాణం చేశాక.. అసలు ఈ ప్రమాణమేంటి..? అయ్య తోడు.. అమ్మతోడు..? ఏంటి కల్చర్ అని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవన్నీ సొంత పార్టీ నేతలను ఉద్దేశించే ఈటల చేశారని కొందరు ముఖ్య నేతలు షాకు ఫిర్యాదు చేశారట. మరోవైపు రేవంత్-ఈటల ఎపిసోడ్‌లో (Revanth-Etela Episode) పార్టీ నుంచి ఎలాంటి సపోర్టు లేదనే విమర్శలు వచ్చాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకోవట్లేదేమని గట్టిగానే షా తలంటారట.

మొత్తానికి చూస్తే.. అమిత్ షా చేవేళ్ల సభ ఏ మాత్రం బీజేపీలో జోష్ నింపిందో తెలియదు కానీ.. ఈటలకు, బండికి మాత్రం గట్టిగానే క్లాస్ అయ్యిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మున్ముందు తెలంగాణ బీజేపీలోకి ఏ మాత్రం చేరికలుంటాయ్..? షాకు అంత ధీమాకు ఇచ్చిన ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారు..? అసలు ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలెంత అనేది తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మీడియా ముందుకొస్తే కానీ తెలియదన్న మాట.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

AP Politics : వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా.. ఈ పోస్టర్లలో నిజమెంత.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకిలా..!?


******************************

Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉండగా.. డైరెక్టర్ ఆర్జీవీ పెను సంచలనం..

******************************

KCR BRS Sabha : మరాఠా గడ్డ నుంచి మాటిస్తున్నా.. మొత్తం మార్చేస్తా.. కీలక హామీలిచ్చిన కేసీఆర్..
******************************

SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..


******************************

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి సాధించిన సీబీఐ.. సడన్‌గా ఇలా జరగడంతో...

******************************

Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

******************************

Updated Date - 2023-04-25T21:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising