ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు కవిత కీలక సమావేశం.. ఈడీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు.. కీలక పరిణామాలుంటాయా..!?

ABN, First Publish Date - 2023-03-21T11:19:01+05:30

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మూడోరోజు ఈడీ విచారణకు వెళ్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మూడోరోజు ఈడీ విచారణకు వెళ్తున్నారు. కాసేపట్లో ఢిల్లీలోని సీఎం కేసీఆర్ (CM KCR) నివాసం నుంచి కవిత బయల్దేరి వెళ్లనున్నారు. అంతకుముందు లాయర్లతో కవిత కీలక సమావేశం నిర్వహించారు. ఇవాళ్టి విచారణలో ఎలా ముందుకెళ్లాలి..? అనేదానిపై న్యాయవాదులతో ఆమె సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు అరగంటకుపైగా లాయర్లతో కవిత, మంత్రి కేటీఆర్ (Minister KTR) చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. న్యాయవాదులతో సమావేశం అనంతరం కవిత తిరిగి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈడీ విచారణకు ముందు కవిత ప్రెస్‌మీట్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు మీడియా ప్రతినిధులు కూడా కేసీఆర్ నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఈ మీడియా మీట్‌లో తన ఫోన్లను చూపించే అవకాశం ఉంది. కాగా సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు, ధ్వంసం కూడా చేసినట్లు ఈడీ అభియోగం ఉంది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టంగా తెలిపింది.

భారీగా మోహరించిన పోలీసులు..

ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో హస్తిన వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అర్థమవుతోంది. ఆఫీసు చుట్టుపక్కలా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు.. కొత్త వ్యక్తులు లేకుండా పోలీసు ఉన్నతాధికారులు చూస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే కేసీఆర్ నివాసం దగ్గర మాత్రం అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇటు తెలంగాణలోని బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం హస్తినలో అసలేం జరుగుతోంది..? అని టీవీలకు అతుక్కుపోయారు.

అన్నీ తానై..!

కవిత మొదటిసారి విచారణకు వెళ్లినప్పట్నుంచీ ఇప్పటి వరకూ సోదరి కవితకు అన్నీ తానై మంత్రి కేటీఆర్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో హస్తినలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు అధినేత కేసీఆర్‌కు కేటీఆర్ సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. కేసీఆర్ నివాసానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, నామ నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, బి.బి పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు.

నిన్న ఇలా..!

సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించినకవిత.. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. లోపలి నుంచి బాగా కందిపోయిన ముఖంతో వచ్చిన ఆమె.. కారులో కూర్చున్న తర్వాత ముఖానికి చిరునవ్వు పులుముకుని కార్యకర్తలకు విజయసంకేతం చూపించారు. నిజానికి కవితను సోమవారం అరెస్టు చేసే అవకాశాలు లేవని ఈడీ అధికారి ఒకరు ఉదయాన్నే మీడియాకు అనధికారికంగా వెల్లడించారు. అయితే మంగళవారం విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలు లేవని చెప్పలేనని అదే అధికారి పేర్కొనడం గమనార్హం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. కవితను ఈడీ కార్యాలయం రెండవ అంతస్తులోని ఒక గదిలో సుదీర్ఘంగా విచారించారు. దర్యాప్తు అధికారి జోగీందర్‌, ఒక మహిళా అధికారితో పాటు ముగ్గురు అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ ఈడీ విచారణలో ఏం అడుగుతుంది..? ఢిల్లీ వేదికగా ఏమేం పరిణామాలు చోటుచేసుకుంటాయి..? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో మూడో రోజూ టెన్షన్.. టెన్షన్ నెలకొంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP : వైసీపీలో ఇంత చిల్లర బ్యాచ్ ఉందేంట్రా బాబోయ్.. ఛీ.. ఛీ.. సిగ్గో సిగ్గు..!

******************************

MLC Kavitha : ఏడు గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. హస్తినలో మారిపోయిన సీన్.. భారీగా పోలీసులు మోహరించడంతో..!


******************************

Updated Date - 2023-03-21T11:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising