ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam Case : బీఆర్ఎస్ నేతలంతా ఇలా చేయండి.. కవిత ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్ కీలక సూచనలు..!

ABN, First Publish Date - 2023-03-10T21:08:12+05:30

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం నాడు ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం నాడు ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే.. (CM KCR ) కవితను అరెస్ట్ చేయొచ్చని కామెంట్స్ చేయడంతో కచ్చితంగా విశ్వసనీయ వర్గాల సమాచారంతోనే ఇలా మాట్లాడి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే.. కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలనేదానిపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కీలక సలహాలు, సూచనలు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ (BRS) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా కవిత ఈడీ విచారణ, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు, సంక్షేమ పథకాలు ఇలా చాలా విషయాలపై నిశితంగా చర్చించారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది.

ఇలా చేయండి..!

కేంద్రంలో దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఉంది. దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుంది. అప్పుడు గంగుల, రవిచంద్ర, మల్లారెడ్డి.. ఇప్పుడు నా బిడ్డ కవిత వరకు దర్యాప్తు సంస్థలు వచ్చాయి. అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారు. ఏం చేస్తారో.. చేసుకోనివ్వండి. కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదు. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించొద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను సీబీఐ, ఈడీ దాడులతో వేధిస్తోంది. ఏం చేసినా సరే ఎవరూ భయపడకండి. బీజేపీ వేధింపులను తిప్పికొడదాం. తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓర్వట్లేదు. బీజేపీ చేతకానితనం బయటపడుతుందనే కేంద్రం.. దర్యాప్తు సంస్థలతో కుట్రలు చేస్తోంది. బీఆర్ఎస్ నేతలంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ పనిచేసినా ఆచితూచి చేయండిఅని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా తన క్యాబిన్‌కు పిలింపించి కేసీఆర్ క్లాస్ కూడా తీసుకున్నారని తెలియవచ్చింది.

అంతా చెప్పేశారా..!?

ఇదిలా ఉంటే.. కవితను అరెస్టు చేస్తే.. బీఆర్‌ఎస్‌ పరంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను ఇప్పటికే గులాబీ నేతలకు బాస్ దిశానిర్దేశం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు.. శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాల్లోనే ఏం చేయాలనేది కేసీఆర్ వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ ఉద్యమించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చినట్లు సమాచారం. అలాగే.. ప్రతిపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాలపై బీజేపీ ధోరణి ఎలా ఉంది..? కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోంది..? అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ కీలక ఆదేశించారని సమాచారం.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

MLC Kavitha : హుటాహుటిన హస్తినకు బయల్దేరిన మంత్రి కేటీఆర్.. ఏం జరుగుతుందో..!


******************************

BRS KCR : తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో ఒకే ఒక్క మాటలో తేల్చేసిన సీఎం కేసీఆర్..


******************************

Delhi Liquor Scam : కవితకు ఈడీ నోటీసులివ్వడంపై ఫస్ట్ టైమ్ స్పందించిన కేసీఆర్.. సీఎం మాటలతో బీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్..


******************************

Updated Date - 2023-03-10T21:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising